Sunday, January 28, 2018

ఈ రోజు ఒక ప్రదేశానికి వెళ్ళడానికి

ఈ రోజు ఒక ప్రదేశానికి వెళ్ళడానికి ఊబర్ తీసుకోవాల్సి వచ్చింది ...
కాబ్ వచ్చాక ... ఎక్కగానే, "గుడ్ ఈవెనింగ్ యంగ్ లేడీ ....హౌ ఆర్ యు" నవ్వుతూ పలకరించాడు కాబ్ డ్రైవర్ ....(ఇక్కడ డ్రైవర్ అనడం బాగుండదేమో ....ఊబర్ వచ్చాక ....ఇంట్లో ఖాళీగా ఉండి కార్ ఉన్నవాళ్లు ....కూర్చుని మాత్రమే పని చేయగలిగే వాళ్ళు , ఇంట్లో వూరికే కూర్చునే బదులు ఏదో ఒక వ్యాపకం ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళ జీవితాలకు ఊబర్ అనేది ఒక వ్యాపక అవకాశం కల్పించింది అని చెప్పొచ్చు .....)
అతన్ని చూస్తే 70 ఏళ్ళు ఉంటాయనిపించింది ....అమెరికన్ అని చూస్తేనే తెలిసిపోతుంది ....కొందరిని చూడగానే గౌరవభావం కలుగుతుంది ....కారణాలు అన్వేషించకుండానే ....అతన్ని చూస్తే కూడా గౌరవభావం కలిగింది ....ఆ వయసులో కూడా నవ్వుతూ హుషారుగా...ఆనందంగా ... పని చేయడం చూసి ....🙏
"ఫైన్ ..థాంక్స్ ....హౌ ఆర్ యు డూయింగ్" నవ్వుతూ అడిగా ...🙂
పలకరింపులయ్యాక ....నేను చేరుకోవాల్సిన చిరునామా చెప్పి రిలాక్సింగ్ గా కూర్చున్నా ....
అడ్రస్ GPS లో సెట్ చేసాక ...."ఒకే ...ఇప్పుడు మనం గమ్యం చేరుకునేలోగా కాసేపు మాట్లాడుకుందాం ...." అడిగాడు ....నవ్వుతూ
🙂
ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ...."సరే ...." చెప్పా ...
"మీరు ఇండియా నుండి వచ్చారా .." అడిగాడు ...
"అవును " చెప్పా ....
"ఇండియాలో బాగా పాపులర్ అయిన భాషలు ఏంటి ...." అడిగాడు ....
"హిందీ ...." చెప్పా ....
"రైట్ ...."
"తెలుగు ....మా లోకల్ లాంగ్వేజ్ " చెప్పా
"నో " అన్నాడు నవ్వుతూ ....
"ఒకే ....ఇంగ్లిష్ " నవ్వుతూ చెప్పా ..
"ఎస్ ..."అన్నాడు ,,,
"కావచ్చు ....నేనెలా అంగీకరిస్తాను ....నేను ఇండియన్ ని ..." కన్నింగ్ గా నవ్వా ....😜
తను కూడా స్పోర్టివ్ గా తీసుకున్నాడు ....
మొత్తం ...300 భాషలు ఉన్నాయి కదా ఇండియాలో ....అన్నాడు ....
"కాదు 3000, ఇంకా ఎక్కువే ఉండొచ్చు ....
అందుకే మా దేశం ఎంతో అందంగా కనిపిస్తుంది ...."చెప్పా ....😍
"సరే ....నేను చాలా మంది ఇండియన్స్ తో రోజూ మాట్లాడుతూ ఉంటాను ....
"ఇండియన్స్ చాలా స్మార్ట్ కదా ...." అడిగాడు ...😀
"కావచ్చు ....నేను స్మార్ట్ కాదు ...రోజూ నన్ను అందరూ అంటూ ఉంటారు ....నన్ను స్మార్ట్ కాదు అని ....నువ్వు స్మార్ట్ గా ఉండడం నేర్చుకో అని ....నేనూ చాలా ప్రయత్నించా ....వాళ్ళలా స్మార్ట్ గా కావాలని ....కానీ కాలేకపోయా ...." బాధగా చెప్పా ....😭
"అయినా మేమంతా స్మార్ట్ అని మీకెవరు చెప్పారు ...." ఆరా తీసా ....🤔
"నాతో మాట్లాడినవాళ్లు ...ఇండియన్స్ చెప్పారు ...." చెప్పాడు ...
"ఇంతకూ వాళ్ళు స్మార్ట్ అంటే అర్ధం ఏమైనా చెప్పారా .." అడిగా ....
"స్మార్ట్ అంటే ...స్మార్ట్ గా ఉండడమే కదా ...." అడిగాడు ....
"ఓహ్ ....అక్కడే పప్పులో కాలేశారు ...నీ దృష్టిలో స్మార్ట్ అంటే అర్ధం ఏమిటో చెప్పు ...." అడిగా ...🤣
"స్మార్ట్ గా ఉండడం అంటే ....,తెలివిగా ఆలోచించడం ....సమయస్ఫూర్తిగా ఆలోచించడం ...." ఆలోచించి చెప్పాడు ...🤔
"అది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లో ....😀స్మార్ట్ ఫర్డ్ డిక్షనరీ లో, స్మార్ట్ అంటే ....అతి తెలివిగా ఆలోచించడం ....ఎదుటివాడిని ఎలా బోల్తా కొట్టించాలా అని ఆలోచించడం .... " నవ్వుతూ చెప్పా ....🤣
"నిజమా " ఫక్కుమని నవ్వాడు ....😀
"కానీ మీరు తెలివైన ఉద్యోగాలు చేస్తారు కదా ..." సందేహంగా అడిగాడు ...
"కావచ్చు ....మానేజ్మెంట్ అంతా మీదేగా ....మీరు అంతకంటే తెలివైన వాళ్ళు కదా ....."అడిగా ....
చివరగా ......
"ఈసారి నుండి... మీ కాబ్ ఎక్కిన ఇండియన్స్ అందరినీ ...ఒక ప్రశ్న అడగండి ....వాళ్ళ దృష్టిలో స్మార్ట్ గా ఉండడం అంటే అర్ధం ఏమిటి అని ....ఆన్సర్ తెలుసుకోండి ....అప్పుడు మీకు స్మార్ట్ అంటే అర్ధం తెలుస్తుంది ...." చెప్పా ....
"తప్పకుండా అడిగి ....ఈసారి కలిసినప్పుడు ....నీతో చెబుతాను ...."చెప్పాడు ....
-------------------------------
అదన్నమాట సంగతి ....మనం చాలా స్మార్ట్ అని మోత మోగిపోతుందన్నమాట .... ప్రపంచం అంతా .....😂🤣😀😊

No comments:

Post a Comment