Tuesday, January 16, 2018

ఎవరు ఎవరికి శత్రువులు ....??!! ఆలోచించండి....😍

మన స్వీయ రక్షణ కోసం మనం ...మనకు - మన స్నేహితులకు , బంధువులకు , సమాజానికి (వాళ్ళల్లో శత్రువులు ఉంటారేమో అనే భయంతో ) మధ్య ఎన్నో గోడలు నిర్మించుకుంటాం ....
కానీ మనకు - మన శరీరానికి , మనసుకు మధ్య ...ఏ గోడలూ లేకుండా వదిలేస్తాం ....
మన స్నేహితులు , బంధువులు , సమాజం ఎవరైనా మనల్ని చిన్నమాట అనగానే అవి అనిపించుకోకుండా ఉండడానికి , మన పరిగణలోకి తీసుకోకుండా ఉండడానికి ఏం చేయాలో అంతా చేస్తాం ....
చివరకు ఎదురుదాడి చేయడానికీ వెనకాడం ....వాళ్ళను వదులుకోవడానికి వెనకడుగు వేయం ....
ఇదంతా మన స్వీయ రక్షణలో భాగమే ....😍
కానీ ....,, మన శరీరానికి / శరీరంలో ఉన్న అవయవాలకు ...మనం శత్రువులాంటి ఆహారం ఇస్తాం ...అవి వాటి ఆరోగ్యాన్ని ఎలా దెబ్బ తీస్తున్నాయో....హింసిస్తున్నాయో గమనించం....🤔
ఉదాహరణకు విపరీతమైన కారం ....అది లోపలి పంపించగానే కడుపులో మంట మొదలవుతుంది ....రోజూ తినీ తినీ అవయవాలన్నీ పాడయ్యేవరకు తింటూనే ఉంటాం ....😥
అలాగే మనసు ....ఎన్ని కుళ్ళు ఆలోచనలను దాని నిండా నింపుతున్నాం ...అది తట్టుకోలేక ఎంత విలవిలలాడిపోతుందో గమనించం ....అది దాని సహజమైన సున్నితత్వం కోల్పోయి ఎంత క్షోభ పడుతుందో అర్ధం చేసుకోము...అది కోరుకున్న ప్రేమను దానికి ఇవ్వం ....ద్వేషాన్ని నింపాలని చూస్తాం ....😥
నిజానికి సమాజంలో మన శత్రువులు మనకు చేసే హాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువ హాని మనం మన శరీరానికి , మనసుకు చేస్తున్నాం ....😥
ఎవరు ఎవరికి శత్రువులు ....??!! ఆలోచించండి....😍

No comments:

Post a Comment