Saturday, December 17, 2016

ఎదురుగా ఉన్నవాళ్లను వాళ్ళు ఎప్పటికీ ప్రేమించలేరు ....

మనం మనుషులుగా పుడతాం ....మనుషులుగా పోతాం ...,,

అయితే పుట్టడానికి పోవడానికి మధ్య కాలంలో మనిషి కొన్ని ముఖ్యమైన స్వకార్యాలను , పర కార్యాలను చేస్తూ ఉండడం సహజం .... :) 

అందులో మనిషికి ప్రాధమిక అవసరాల తర్వాత ....అవసరమైనది , మనిషి అనుక్షణం కావాలని తపించేది , అది లేకపోతే కష్టపడి / ఇష్టపడి సంపాదించుకునేది .... చెప్పుకోదగినంత ముఖ్యమైన స్థానం ఉన్నది  "ప్రేమ" అనేది నిర్వివాదాంశం ... <3 

ప్రేమ అంటే ఒకటే అయినా ....కాలానుగుణంగా మనుషులు దాన్ని రకరకాలుగా విభజించి ....వాళ్లకు అనుగుణంగా మార్చుకుని  ... ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రేమిస్తూ ఉంటారు ....ఆశిస్తూ ఉంటారు ....అనేది ప్రేమెరిగిన సత్యం  .....

నాకు కొందరి ప్రేమ చూస్తే ....చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది .....వింతగానూ అనిపిస్తుంది .....అసలు అది ప్రేమ అంటారా అని తెలియని అయోమయం లోకి వెళ్ళిపోతూ ఉంటా ....కానీ సదరు వ్యక్తులు ఇది ప్రేమే అని మనసు గిల్లి మరీ చెబుతూ ఉండడం వల్ల సందిగ్ధావస్థలో కొట్టు మిట్టాడుతూఉంటా ....

------------------------------------------------

గత కొన్నేళ్లలో అలాంటి సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు ...నా మదిలో ప్రశ్న ఉదయించింది .... 

అదేమిటంటే ....

కొందరు... వాళ్ళ జీవితకాలంలో ... ,,,,

- వాళ్ళ దగ్గరున్నవాళ్లను అస్సలు ప్రేమించరు....దూరంగా ఉన్నవాళ్లను కడవలు కడవలు ప్రేమిస్తారు ............

- దగ్గరున్నవాళ్ళ మొహం కూడా చూడరు .....దూరంగా ఉన్నవాళ్ళను ఆణువణువూ చూడాలని పరుగులు తీసుకుంటూ వెళ్తారు ....

- దగ్గరగా ఉన్న వాళ్ళు దూరమైనప్పుడు ప్రేమిస్తారు .....దూరమైన వాళ్ళు దగ్గరైనప్పుడు ప్రేమించలేరు ....

- దగ్గరున్నవాళ్ళు దూరమైనప్పుడు దగ్గరవ్వాలనుకుంటారు .....దూరంగా ఉన్నవాళ్లు దగ్గరైనప్పుడు దూరం కావాలని చూస్తారు .... 

- మొత్తానికి వీళ్ళు ప్రేమించాలి అంటే .....వీళ్లకు ఒక ఆరడుగుల దూరంలో  ఉండాలి ....(ప్రేమించబడకూడదు అంటే ....అరడుగు దూరంలో ఉంటే చాలు  ....)

- అంతకు మించి ఒక్క అడుగు ముందుకు వేశామా .....ఏం కాదు ....వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేస్తారు ....ఆరడుగులు చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది అన్నట్టు ....

ఎందువలన, ఎందువలన, ఎందువలన ....అనే ప్రశ్న నన్ను ఆలోచింపజేసింది ..... 

లక్షణాలు ఎందుకో మానవ జీవితానికి భిన్నంగా అనిపించాయి ..... :( 

మనం అంటూ భూ ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు , మన చుట్టూ కొన్ని వింత లక్షణాలు ఉన్న జీవులు బ్రతుకుతున్నప్పుడు ...., వాళ్ళు మానవ సమాజానికి భిన్నమైన లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ...వాళ్ళు జన జీవన స్రవంతిలో కలవలేకపోతున్నప్పుడు ....బాధ్యతాయుతమైన పౌరులుగా మనం వారి మీద పరిశోధన చేసి , అందుకు గల కారణాలు కనుగొని .....వీలైతే / ఉంటే వారికి పరిష్కార మార్గాలు చూపించాలి కాబట్టి ....నేను కూడా ....
నా బాధ్యతలో భాగంగా ....అలాంటి వ్యక్తులు  నాకెదురైనప్పుడు , వాళ్ళని  అన్వేషించి ...  జీవిత సత్యం తెలుసుకున్నాను .....

సమాధానం ఎంతో కొంత దొరికిన సంతృప్తి కలిగింది ...

అయితే ఇదే సరైన సమాధానం కాకపోవచ్చు , అలా అని అవనూ వచ్చు ....ఏది ఏమైనా సమాధానంతో సంతృప్తి అయితే చెందను....మళ్ళీ అవకాశం దొరికితే భవిష్యత్తులో మరి కొన్ని విషయాలు తెలుస్తాయేమో అన్వేషిస్తూ మాత్రం ఉంటా ...

-----------------------------------------

ప్రస్తుత అన్వేషణలో బయటపడిన విషయం ఏమిటి అంటే .....,,,,

"ఎదురుగా ఉన్నవాళ్లను వాళ్ళు ఎప్పటికీ ప్రేమించలేరు ....దూరంగా ఉన్నవాళ్లను మాత్రమే ప్రేమించగలరు .....(ప్రేమిస్తున్నాం అని భ్రమ పడగలరు)"

ఎందువలన అనగా ....

వాళ్ళ లోపాలను ...ఎదురుగా ఉన్నవాళ్లు స్పష్టంగా చూడగలరు ... వీళ్ళకున్న లోపాలు వాళ్లకు వాళ్ళే అసహ్యించుకునే లోపాలు అయిన కారణంగా ....ఎదుటివారు కూడా తప్పనిసరిగా అసహ్యించుకుంటారు అని వీరు బలంగా నమ్ముతారు ....

అందుకే ఎదుటి వాళ్ళు దగ్గరకు వచ్చే కొద్దీ వీళ్ళు భయపడి దూరంగా పారిపోతారు ....

మరి వీళ్ళు దూరంగా ఉన్నవాళ్లను ప్రేమిస్తున్నారు కదా అని అనుకుంటే ....వాళ్లు కూడా అదే భ్రమలో ఉండి పరుగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకు వెళ్తారు ....కానీ వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే గాలి తీసిన బెలూన్ లా వీళ్ళ ప్రేమ తుస్సుమంటుంది .... స్థానంలో మళ్ళీ భయం చోటు చేసుకుంటుంది .....ఎక్కడ వీళ్ళ లోపాలు కనిపిస్తాయో అని ....వీళ్లకు వీళ్ళే వాళ్లకు దూరమవుతారు ....

అప్పుడు వీళ్లకు, ఇంతకు ముందు దగ్గర ఉన్నవాళ్లు దూరంగా ఉన్నారు కాబట్టి  వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది ....(ప్రేమించే అవసరం కలుగుతుంది ....).అప్పుడు వాళ్ళ లోపాలు వీళ్లకు కనిపించవు కాబట్టి అనుకోండి .....
ఇంకా కాస్త ముందుకు వెళ్లి ...వాళ్లలో లోపాలు చూసి అయితే వీళ్ళు అసహ్యించుకుంటారని ఇంతకు ముందు భయపడ్డారో .....అవి ఇప్పుడు నాలో లేవు అని, వీళ్ళను... దగ్గరకు వచ్చే ముందే నమ్మించాలని చూస్తారు .....అప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా చూడలేరు కాబట్టి ....చెప్పింది నమ్మి , వాళ్ళు ప్రేమిస్తారని ఆశ పడతారు .... :( 

వీళ్ళ దగ్గరకు వచ్చాక వాళ్ళు ....వాళ్ళ దగ్గరకు వెళ్ళాక వీళ్ళు ....వీళ్లో, వాళ్ళో దగ్గర ఉంటే దూరంగా ఉన్న మరొకరు .....

వీళ్ళు జీవితంలో ఎప్పటికీ ఎవరికీ దగ్గర కాలేరు .....ఎందుకంటే ....వాళ్ళే వాళ్లకు ఎప్పుడూ దగ్గర కాలేరు .....వాళ్లంటే వాళ్లకు కూడా భయం కాబట్టి .....

వీళ్ళ ప్రేమ వీళ్లకు ఎప్పటికీ ఎండమావి లాంటిదే ..అల్లంత దూరంలో కనిపించినట్టు అనిపిస్తుంది ....దగ్గరకు వెళ్తే వెక్కిరిస్తుంది .....

ప్రేమ కోసం వీళ్ళ అన్వేషణ ఎప్పటికీ పూర్తి కాదు .....ప్రపంచం అంతా తిరుగుతూనే ఉంటారు ....అలానే జీవితం ముగిసిపోతుంది అనేది వాళ్ళు జీర్ణించుకోలేని చేదు వాస్తవం .... :( :( 

విచిత్రం ఏమిటంటే ప్రేమ వీళ్ళ దగ్గరగానే ఉంటుంది ....అది వీళ్లకు కనిపించదు(చూడలేరు ....) ....దూరంగా ఉన్న ఎండమావినే చూస్తూ ప్రేమ అనే భ్రమలో వెళ్లడం , అందుకోవాలని ప్రయత్నించడం , ఆశాభంగానికి గురికావడం వీళ్ళ జీవితచర్య ..... :( :( :( 

--------------------------------------------

మరి వీళ్ళ జీవితం ఇలా ముగిసిపోవలసిందేనా ....??!! పరిష్కారమే లేదా ??!! అని సందేహం కలగడం సహజం  .....

ఎక్కడైతే సమస్య ఉంటుందో ...అక్కడ తప్పనిసరిగా పరిష్కారం ఉంటుందనే నమ్మకం తో ఆలోచిస్తే ఒకే ఒక్క పరిష్కారం దొరికింది ..... :) 

"వాళ్ళు వాళ్ళ లోపాలను సరిదిద్దుకుని ....ముందు వాళ్ళను వాళ్ళు ప్రేమించుకుంటే ....ఎదుటివాళ్ళ ప్రేమ ను గుర్తించగలరు అని అర్ధమైంది ...." :) 

లోపాలు దాచి వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటూ బ్రతికినంత కాలం ....ఎవరికీ వాళ్ళను వాళ్ళు చూపించుకోలేరు .....ఎదుటివాళ్ళ ప్రేమను చూడలేరు ...లేని ఎండమావి ప్రేమ కోసం వాళ్ళ అన్వేషణ అంతం కాదు .. :( 

-----------------------------------------

మరి ఇంకా ఆలస్యం ఎందుకు...??!! 

వాళ్ళే అసహ్యించుకునే వాళ్ళ లోపాలను వాళ్ళు సరిదిద్దుకోవడానికి శ్రీకారం చుడతారని... జీవితంలో ఒక్క క్షణం అయినా ప్రేమను పొందగలరని, ప్రేమను ఇవ్వగలరని.... ఆశిస్తూ .....

ప్రేమస్తు ....!! <3 <3 <3 

----------------------------------------

(గమనిక : నేను సైకాలజిస్ట్ ని కాదు ....నా జీవితంలో నాకెదురైన వ్యక్తులను గమనించిన విషయాలు ....వాటిపై నా అభిప్రాయాలు వ్రాస్తూ ఉంటా ....)

No comments:

Post a Comment