Saturday, March 11, 2017

ప్రతి వ్యక్తీ ఎవరికి వాళ్ళు చాలా మానవత్వం ఉన్నవాళ్లే /ఉత్తములే .....

రెండు రోజుల క్రితం ఒకరితో చిన్న వాగ్వివాదం జరిగింది .....వాళ్ళు నాదే తప్పు అన్నారు ....నేను నా తప్పు ఏమీ లేదు అన్నాను ....జరిగింది చెప్పాను ...సంఘటన వివరించాను ....
నష్టపరిహారం కట్టమన్నారు .....సరే అన్నాను ....ఇంత కట్టమన్నారు ......అంత నేను కట్టను/ కట్టలేను ......ఇంత అయితే ఇవ్వగలను అన్నాను ....ఒప్పుకోలేదు .....నేను తప్పుకోలేదు ....మీరు ఇలాంటి వాళ్ళు అని అనుకోలేదు అన్నారు ......ప్రతి వ్యక్తీ ఎవరికి వాళ్ళు చాలా మానవత్వం ఉన్నవాళ్లే /ఉత్తములే ....నిజమైన సందర్భం వచ్చినప్పుడే వాళ్ళ లో ఉన్న అసలు వ్యక్తి బయటకు వచ్చేది ....మీరూ నేనూ అందరం ఉత్తములమే సందర్భం రానంత వరకు అన్నాను ..... చివరకు ఎన్నో వాగ్వివాదాల తర్వాత .....నేను చెప్పిన మొత్తం మాత్రమే ఇవ్వగలను / ఇస్తాను అన్నాను ...మేం చెప్పిన మొత్తం కట్టేవరకు మిమ్మల్ని ముందుకు కదలనివ్వం అన్నారు ......మీరెవరు నన్ను కదలనివ్వకపోవడానికి ..మీకేం హక్కుంది అన్నా ....ఫోన్ లో ఉన్న మావారు ...911 కి కాల్ చెయ్యి అన్నారు ....వాళ్ళు కూడా పిలవండి పోలీస్ ని అన్నారు .....మీరు ఎంతమందిని పిలిచినా ....ఎందరు వచ్చినా అన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా ....నా నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదు ....చెప్పా ప్రశాంతంగా ..... :)
చివరకు నా నిర్ణయానికి తప్పనిసరై ఒప్పుకున్నారు ......చెక్కు రాసిచ్చి ...అక్కడినుండి వాళ్లకు నవ్వుతూ వీడ్కోలు చెప్పి కదిలా ..... :)
రాత్రి నేను షాప్ లో ఉండగా వాళ్ళ దగ్గరనుండి ఫోన్ వచ్చింది ....తర్వాత చూద్దాం అని ఎత్తలేదు ....
వెంటనే రెండో సారి కూడా వచ్చింది .....రెండోసారి వెంటనే అంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది అని ఫోన్ తీశా .....
అటునుండి విపరీతమైన పశ్చాత్తాప భావంతో ....వాళ్ళ గొంతు ....'సారీ ....మేము అసలు అలాంటి వ్యక్తులం కాదు .....అసలు ఆ క్షణంలో ఎందుకు అలా ప్రవర్తించానో ఇప్పటికీ అర్ధం కావడం లేదు ....అలా ప్రవర్తించాక....అసలు నేను ఎలాంటి వ్యక్తిని.. ఏం చేశాను ....తన పట్ల ఎలా ప్రవర్తించాను అనుకుంటే నిద్ర పట్టడం లేదు ...తిండి సహించడం లేదు ....ఒకటే బాధగా ఉంది ....మీకు సారీ చెప్పాలని ఫోన్ చేశాను ....మీరు ఇచ్చిన డబ్బులు కూడా మీకు తిరిగి ఇచ్చేస్తాను ....ఇలా మీకు సారీ చెప్పకపోతే నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను .....ఐ యాం రియల్లీ వెరీ సారీ ....." అని వినిపించింది ....
"నేను అర్ధం చేసుకోగలను ....నాకు మీ మీద ఏం కోపం లేదు .....బహుశా నేను మీ నుండి మరో విధమైన రెస్పాన్స్ ఆశించడం వలన నేను కూడా ఆ సందర్భంలో అలా మీరు ప్రవర్తించేలా ప్రేరేపించి ఉంటాను ....అదొక చేదు సందర్భం ....ఆ సందర్భం వరకు అనుకోకుండా కొన్ని తప్పులు చేసాం అనుకుందాం ....మీరు అదంతా మర్చిపోండి ....ఈ సందర్భంలో డబ్బుల విషయం ఇక రానివ్వకండి .... డబ్బే మన ఫీలింగ్స్ కి అడ్డుకట్ట వేసేది ....నేను అంతా మర్చిపోయాను ...మీ మీద నాకు ఏం కోపం లేదు ....మీరెప్పుడూ హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా ....మనము ఎప్పుడూ ఫ్రెండ్స్ లా ఉందాం ...." చెప్పా మర్యాదపూర్వకంగా ....
"లేదు నన్ను నా మనసులో ఉన్నది చెప్పనివ్వండి ....." అర్ధింపుగా వినిపించింది ....
అలా చెప్పుకోకపోతే వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరని అర్ధమై .....సరే చెప్పండి ....అన్నా ...ఏం చెప్పినా వింటాను అన్నట్టు ....
"అసలు నేను అలా ఎందుకు ప్రవర్తించానో అర్ధం కావడం లేదు ....నేను అలాంటి వ్యక్తిని కాదు ..." మళ్ళీ అదే సమాధానం .....
"నీ పరిస్థితుల్లో ఉంటే నేను కూడా అలాగే ప్రవర్తించి ఉండేదాన్ని ...కానీ ఇప్పుడు కాదు ....కొన్నేళ్ల క్రితం అయితే ....అప్పుడు నేను ప్రవర్తించినట్టే ఇప్పుడు మీరూ ప్రవర్తించారు కాబట్టి ....నాకు నీ ఫీలింగ్స్ అర్ధం చేసుకోవడం ఈజీ అయింది ....కానీ ఇంత త్వరగా తప్పు తెలుసుకోవడం మాత్రం నిజంగా అభినందించదగ్గ విషయం...నిజానికి నేను కూడా ఇంత తొందరగా నా తప్పులు నేను తెలుసుకోలేకపోయాను నా జీవితంలో ...నాకు మిమ్మల్ని చుస్తే చాలా సంతోషంగా ఉంది ....మనం ఇద్దరం అంతా మర్చిపోయి ...మంచి ఫీలింగ్స్ తో ముందుకు వెళదాం ...." అపరాధ భావం పోగొట్టాలని ....చెప్పా.....
===============
ఈ సంఘటన వల్ల నాకొకటి అర్ధం అయింది ....మన జీవితంలో మనకు దుర్మార్గులూ ఎదురవుతారు ....ఉత్తములూ ఎదురవుతారు .....దుర్మార్గులు అనుకున్నవాళ్ళు ఉత్తములని తెలిసినప్పుడు మానవజాతి మీద అమితమైన నమ్మకం .....ఉత్తములు అనుకున్న వాళ్ళు దుర్మార్గులని తెలిసినప్పుడు మానవజాతి మీద అమితమైన అసహ్యం కలగడం సహజం ....!
దుర్మార్గులు అందరు ఉత్తములూ కాదు ....ఉత్తములు అందరూ దుర్మార్గులు కాదు .....మనం కొన్నిసార్లు పొరబడతాం ....సందర్భాన్ని బట్టి .....దుర్మార్గులను ఉత్తములని ....ఉత్తములను దుర్మార్గులని .....
కానీ కాస్త సమయం ఇస్తే ....ఎవరు ఏమిటో తెలుసుకోవచ్చు ....
====================
ఏది ఏమైనా ....ఎవరు ఎలా ఉన్నా ....జీవితం గొప్ప పాఠశాల రా బుజ్జీ ... :) <3