Thursday, March 9, 2017

భూమి సమానంగా ఉంచడం ఆయన బాధ్యత ....

భగవంతుడికి బాధ్యతలు ఏముంటాయా అని కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటా ....??! :(
ఎందుకుండవు ....??!! అనుకుంటాం కానీ భగవంతుడికి కూడా ఆయన బాధ్యతలు ఆయనకు ఉంటాయి ....
ఉదాహరణకు ...భూమి సమానంగా ఉంచడం ఆయన బాధ్యత అనుకుందాం....
సమానం ఏమిటండీ భూమి గుండ్రంగా కదా ఉండేది అని మీకు అనుమానం రావచ్చు .... :)
ఇక్కడ సమానంగా అంటే అర్ధం ... పాపులు అంతా పెరిగిపోయి ....పాపుల పక్కకు .....పుణ్యాత్ములు అంతా పెరిగిపోయి పుణ్యాత్ముల పక్కకు ప్రపంచం ఒరిగిపోకుండా ....బాలెన్స్ చేయడం అన్నమాట .... :P
అది ఎవరి పని ....??!! ఖచ్చితంగా భగవంతుడి బాధ్యతే .....!
సపోజ్ ,,, పర్ సపోజ్ ....మన జీవితంలో మనకు ఒక మనిషి.... పరమ దుర్మార్గుడని , నీచమైన వాడని , నమ్మక ద్రోహానికి వారసుడని , దారి చూపిన వాళ్ళ దారిలో గోతులు తవ్వేవాడని ...మొత్తానికి మనిషి పుట్టుక పుట్టలేదని తెలిసింది అనుకుందాం .....సహజంగానే ....ఛీ వీడూ ఒక మనిషేనా అని అసహ్యం కలుగుతుంది.....
ఆ తర్వాత ...మరుక్షణమే...మనకు జీవితంలో ..ఒక ఉత్తముడు ....మానవత్వం పరిమళించే వ్యక్తి .....సహాయానికి చిరునామా ఇచ్చిన వ్యక్తి ....చేయూత ఇచ్చి దారి చూపే వ్యక్తి తారసపడి .....ఆహా... మానవత్వం ఉన్న మనిషంటే వీళ్ళే కదా అనిపిస్తుంది .....
అలా అనిపించాలి / కనిపించాలి కూడా ....అనిపించకపోతే ....జీవితం మీద ఆశ చచ్చిపోతుంది ....మానవ జన్మ మీద నమ్మకం పోతుంది ....ఒకరినొకరు చంపుకుని ....లేదా ఎవరికి వాళ్లే చచ్చిపోతారు .......
ఏమో ...ఇప్పుడు ఈ మానవత్వం ఉన్నవాళ్లు రేపు మళ్ళీ దుర్మార్గులుగా మారిపోవచ్చు ....అవకాశవాదం అలవరచుకుని .....
ఆ దుర్మార్గులు ఉత్తములు అయిపోనూవచ్చు ...అవసరవాదం అలవరచుకుని ....
లేదా ....ఈ దుర్మార్గులు మరొకరికి ఉత్తములు కావచ్చు ....ఈ ఉత్తములు మరొకరికి దుర్మార్గులు కావచ్చు ....చెప్పలేం ....
ఇలా దుర్మార్గుల్ని , పుణ్యాత్ముల్ని సమానంగా ఉంచకపోతే భూమి ఏదో వైపుకి ఒరిగిపోతుంది అనే భయం భగవంతుడికి కూడా ఉంటుంది ....
అందుకే నిరంతరం ఆయన బాధ్యత ఆయన నిర్వర్తిస్తూ ఉంటాడు .....అదే భూమిని సమానంగా ఉంచడం .... :) :P
ఏది ఏమైనా మనకెవరు తారసపడినా ....మన జీవిత ప్రయాణం నిరంతర పాఠాలతో ....నిత్య నూతనంగా సాగుతూనే ఉంటుంది ....అనేది మనమెరిగిన జీవిత సత్యం ..... :) <3