Tuesday, March 7, 2017

"ప్రొడక్టివ్ అంటే ...."


కొన్ని సంవత్సరాల క్రితం .....ఓ రోజు ....మావారు నా దగ్గరకు వచ్చి ....
=========================
"ఈ రోజు నువ్వు చేసిన ప్రొడక్టివ్ పని ఏమిటో చెప్పు ...." అడిగారు ....
"డిషెస్ / ఇల్లు శుభ్రం చేశా , బట్టలు ఉతికా , బజారుకి వెళ్లి కూరగాయలు ,/ సరుకులు తెచ్చా , ఇంకా పిల్లలకు వండి పెట్టా ..." ఇలా ఏవో చెప్పా ....
"అది కాదు ...ప్రొడక్టివ్ వర్క్ " మళ్లీ అదే ప్రశ్న ....
"ప్రొడక్టివ్ అంటే ...." నిజంగానే తెలియక అడిగా ....
"అంటే నీ కెరీర్ కి , నీ అభివృద్ధికి , నీకు ఉపయోగపడే పనులు ..."
".................................." సమాధానం చెప్పలేకపోయా ..... :(
"ఇకనుండి రోజూ ప్రొడక్టివ్ వర్క్ ఏం చేశావో ఆలోచించుకో ..." చెప్పారు నాకు ...
"మీరేం ప్రొడక్టివ్ వర్క్ చేశారు ..??!!" అసలు ప్రొడక్టివ్ అంటే అర్ధమేమిటో తెలుసుకోవాలని అడిగా ...అలాంటిదే నేను కూడా చేయొచ్చు అని కూడా అనుకోండి .....
"చదువుకున్నా , డబ్బులు సంపాదించడానికి ఉద్యోగం చేశా , నా ఆరోగ్యం కోసం వ్యాయామం చేశా ...మళ్లీ చదువుకున్నా ...కాసేపు నా ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూశా " సమాధానం చెప్పారు ....
ఓహ్ .... ఏదైనా.... మన కోసం మనం చేసుకోవడమే ప్రొడక్టివ్ అని అర్ధమైంది .....
తర్వాత రోజు .....అంతా ప్రొడక్టివ్ వర్క్ చేశా ....
భలేగా అనిపించింది .... :)
రెండో రోజు ....ప్రొడక్టివ్ వర్కే చేశా ....
మూడో రోజు ....
కంచంలో అన్నం పెట్టుకుందాం అని చూస్తే ....కుక్కర్ లో అన్నం లేదు ...పెట్టుకోవడానికి కంచం లేదు .... :(
సింక్ చుట్టూ ఎండిపోయి ,నాకేసినట్టు కంచాలు ...స్టవ్ మీద మాడిపోయిన గిన్నెలు ....
వెంటనే .....,,,
ఘంటసాల భగవద్గీత పెట్టుకుని ....గిన్నెలు కడగడం మొదలు పెట్టా ...
"పార్ధా ..నీవు నా యందే చిత్తము లగ్నము చేసి కృత నిశ్చయుడవై ...యుద్దము చేయుము ...." పార్థుడితో కృష్ణుడు అనడం విని నవ్వొచ్చింది ..... :)
ఎందుకో ....కృష్ణుడిని అడగాలనిపించింది....పని చేసి ...ఫలితం ఆశించకు అని చెప్పావ్ కానీ .... ప్రొడక్టివ్ వర్క్ అంటే ఏమిటో .....ఒక్క ముక్క చెప్పకూడదా ....అని .....
హు ...ఏమో ఎవరికి తెలుసు .....కృషుడు కూడా ఆ ఒక్కదానికే అర్ధం నాకు తెలియదు అని అని తప్పించుకుంటాడేమో అనే నా ఆలోచనకు నాలిక్కరుచుకుని ....టాప్ తిప్పా....యుద్ధం చేయడానికి కాదు ....గిన్నెలు కడగడానికి ....ప్రపంచం గుర్తించని ప్రొడక్టివ్ వర్క్ చేయడానికి .. !
---------------------------------------------
కానీ ఆ క్షణం నుండి ....ప్రతిరోజూ ప్రొడక్టివ్ వర్క్ ఎంత చేస్తున్నానో లెక్క పెట్టుకోవడం మాత్రం నా మెదడు మర్చిపోలేదు .....
అంత విప్లవాత్మకమైన ప్రశ్న నన్ను వేసి నా జీవిత గమనాన్ని మార్చిన మా వారికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు చెప్పక తప్పడం లేదు ..... :):P
---------------------------
మహిళా మిత్రులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ..... :) :P

No comments:

Post a Comment