Monday, September 19, 2016

చాలా మంది నాకు తెలివితేటలు లేవు అనుకుంటూ (అంటూ )ఉంటారు ...

చాలా మంది నాకు తెలివితేటలు లేవు అనుకుంటూ (అంటూ )ఉంటారు ....ఎందుకలా అనుకుంటారా ...అన్ని పనులూ బాగానే చేస్తున్నా కదా ,అన్ని మాటలు అందరిలా మాట్లాడుతూ ఉన్నా కదా అనుకుంటూ ఉంటా .... :(

చివరికి చాలా కాలం ఆలోచించి ఆలోచించి నేను అమాయకురాలినే అని అందరికీ చెప్పి ... నేను ఫిక్సయ్యే లోపల …నేను అమాయకురాలిని కాదు అని ప్రూవ్ చేసుకునే ఒక సంఘటన ఎదురైంది .... :)

ఆ మధ్య ఒకరు ఇలాగే "నువ్వెంత అమాయకురాలివో నాకిప్పుడు అర్ధమైంది ...." అన్నారన్నమాట నాతో ....

"నాకేమీ తెలివి లేదని....ఉన్నదంతా అమాయకత్వమే అని....
నేనెప్పుడో అంగీకరించాను ....అయినా ఇప్పటివరకు ఆవిషయం గుర్తించకుండా ....ఇప్పుడు ...నా అమాయకత్వం గుర్తించిన మీరు ....నాకంటే ఇంకెంత అమాయకులై ఉంటారో ఆలోచించండి ....." అని తెలివైన అమాయకంగా సమాధానం చెప్పా... :) 

చివరకు నా కంటే అమాయకులు కూడా ఉన్నారని అర్ధమై చాలా ధైర్యంగా అనిపించింది అనుకోండి ....అది వేరే విషయం ....!!

ఇంతకూ నన్ను అమాయకురాలు అని ఎందుకు అనుకుంటున్నారో చెప్పలేదు కదూ .....,,,

అంటే ... కొంతమందిలా ..గుట్టు చప్పుడు కాకుండా ...మూడో కంటికి తెలియకుండా ... కావాల్సిన పనులు ,కావాల్సిన వాళ్ళనడిగి చక్కబెట్టుకోకుండా ....మనసులో ఉన్నదంతా మాట్లాడేసి …దాచకుండా బయటికి చెప్పేస్తూ ఉంటా .....అదన్నమాట సంగతి .....అలా చెప్పడం వలన నాకు చాలా కష్టాలు కూడా వస్తూ ఉంటాయనుకోండి .... :(

మనలో మనమాట .... తెలివితేటలు ఉన్నవాళ్ళు అలా మనసులో ఉన్నది ఉన్నట్టుగా బయటికి చెప్పరట....అసలు మనసులో ఉన్నది కాకుండా వేరే కథ అప్పటికప్పుడు అల్లి చెప్పేస్తూ ఉంటారట .... చాలా తెలివి ఉన్నవాళ్ళు అయితే ....కథలే చెప్పాల్సిన అవసరం ఉండదట ....కథే వాళ్ళ దగ్గరకొచ్చి మమ్మల్ని ఇలా అల్లి చెప్పండి ...అలా అల్లి చెప్పండి ....అని బ్రతిమాలుకుంటుందట ..... ఎంత తెలివితేటలో కదా .... 

వాళ్ళు అదృష్టవంతులురా బుజ్జీ .... :(

"సరేలెండి ....అలాంటి తెలివితేటలు ఎన్ని తపస్సులు చేసినా ఈ జన్మకు నాకు రావని అర్ధమైంది ....ఏదో ఇలా అమాయకంగా నన్ను బ్రతకనివ్వండి ..."అని తెలివైన వాళ్ళందరికీ పేరు పేరునా చెప్పడం తప్ప నాకు మరో మార్గం లేదు ఇక ... :(

తెలివైన వాళ్ళందరూ ...ఇలాంటి తెలివిలేని స్టేటస్ పెట్టింది ఏమిటా అని అలా కోపంగా చూడకండి ....నాకు తెలివైన స్టేటస్ లు పెట్టడం మాత్రం ఎలా వస్తుంది ...??!!...... ఎలా ...హౌ .... :) :) 

No comments:

Post a Comment