Friday, November 4, 2016

"సమస్త సమస్యోభవః సుఖినోభవంతు ...."

నిన్న ... 

బయటకు వెళ్లినప్పుడు పనుండి దారిలోనే ఉన్న AT&T కి వెళ్ళా ....

అక్కడ ఎవరో ఒక కస్టమర్ ఉన్నారు ...కస్టమర్స్ గురించి కేర్ తీసుకునేవాళ్ళు నలుగురు ఉన్నారు ....

ఒకతను, నేను వెళ్ళగానే ఏం కావాలో అడిగాడు ....

సరే ....నాపని చూసుకుని నేను బయటకు రాబోతుంటే ....."బాగున్నారాండీ" అని పలకరించాడు మరో కస్టమర్ ....తెలుగులో ....

"బాగున్నానండీ" అంటూనే ఎక్కడ చూశాను అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నా .... :( 

నేను వ్యక్తుల ముఖాలను సరిగా గుర్తుపెట్టుకోలేను అని ఆత్మీయ వర్గాల అభియోగం నిజం అవుతుందేమో అని సంశయం.... వెంటనే వారెవరో గుర్తుకు తెచ్చి నన్ను రక్షించింది ....:P 
(ఎందుకు గుర్తుపెట్టుకోలేనో ఆమధ్య పరిశోధించిన రహస్యం .... మరో సారి వివరంగా చెప్తాను :) )

"ఓహ్ మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను .....మీరు బాగున్నారా ...." పలకరించాను .....గుర్తుపట్టలేకపోవడం అనేది తప్పు కాదు కాబట్టి సారీ చెప్పకుండా .... :P 

అతను నన్ను పలకరించడం కూడా అదే మొదటిసారి ....ఎప్పుడూ చూస్తూ ఉండేవాడు ..కానీ పలకరించేవారు కాదు ......

కొన్ని పలకరింపులు తర్వాత .......మర్యాదపూర్వక కబుర్లు తర్వాత ....

"మీకు సమస్య ఉందనుకుంటా కదండీ ....." అడిగాడు ....
"అదేమంత పెద్ద సమస్య కాదండీ ....అది ఇలా పరిష్కరించొచ్చు ...." చెప్పా .... :) 

" ...మీకు సమస్య కూడా ఉన్నట్టు గుర్తు ...." సాలోచనగా మరో ప్రశ్న ....
"అది కూడా సమస్య కాదండీ ....అందరూ సమస్య అనుకుంటారు .....అది కూడా ఇలా పరిష్కరించొచ్చు ...."ప్రశాంతంగా చెప్పా .... :) 

"లేదండీ తప్పనిసరిగా ఇది మాత్రం మీకు సమస్యే అయి ఉంటుంది కదా ....." ఖచ్చితంగా అయి ఉంటుంది అని నొక్కి మరీ అడుగుతూ ....
"ఎక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉంటాయి కదండీ .... మాత్రం సమస్యలు లేకుండా మనిషి జీవితం ఎలా ఉంటుంది ....కాబట్టి ఇది కూడా సమస్యే కాదు ....." చిరునవ్వుతో నేను .... :) 

"మీరు ఎన్నయినా చెప్పండి .....ఇది మాత్రం సమస్యే ...." మీరు ఇది ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోను అనే ధోరణిలో అతను ..... :P 

ఇంత ఖచ్చితంగా నొక్కి చెప్పాడు అంటే .....ఏదో కారణం ఉండి ఉంటుంది అని ....నేను అతన్ని వారించి మాట్లాడడం ఆపేసి ....అతని దారిలోకి వెళ్లి మాట్లాడాలని నిర్ణయించుకుని ....
"నిజమేనండీ .....అది మాత్రం సమస్యే ....ఎంతో కష్టమే ...." చెప్పా నవ్వుతూ ... :) :P 

"అవునండీ నాకు నాలుగునెలల నుండి చుక్కలు కనపడుతున్నాయి ...." అని తన వ్యక్తిగత సమస్యతో తాను ఎంత బాధ పడుతుందీ వివరిస్తూ ....అతను ...

==========================

"నేను మనసులో బాధపడుతున్నాను .....మీరు కూడా బాధగా ఉండే తీరాలి .....మీరు బాధల్ని అధిగమించి సంతోషంగా ఉండే అవకాశం లేదు ....మనిషన్న వాడు ఎవడూ అలా ఉండే అవకాశం లేదని నేను నమ్ముతూ ఉన్నాను ....నా నమ్మకం ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం కావాలి ......అనే ముక్క ... ముందే చెప్పొచ్చు కదా ....మన సంభాషణ మొదటివాక్యం లోనే ముగిసిపోయేది ...." మనసులో నవ్వుకుంటూ అనుకున్నా ..... :) :) :P 

========================

అలాంటి వ్యక్తులకు సమస్యలే కావాలి ....పరిష్కారాలు అవసరం లేదు ....పరిష్కారాలు కనిపించినా సమస్యల కొరకు భూతద్దం పెట్టి అన్వేషిస్తూ ఉంటారు ....వాళ్ళని కూర్చోపెట్టి ...."ఎంత క్లిష్టమైన సమస్య అయినా ఒక పరిష్కారం ఉంటుంది ....ప్రతి సమస్యనూ పరిష్కరించుకోవచ్చు ...." అని మనం చిలక్కి చెప్పినట్టు చెప్పినా ......"చాల్లే పోవమ్మా నాకు సమస్యలు లేక చచ్చిపోతుంటే .....నువ్వు కష్టపడి వెతుక్కుని ఆనందంగా బాధపడుతున్న సమస్యల్ని పరిష్కరిస్తాను అంటావు ...." అని మొహమ్మీదే దుమ్మెత్తి పోస్తారు :) :) 

కాబట్టి ....."నా సమస్య భరించలేకపోతున్నాను ఎవరైనా పరిష్కారం చెప్పండి అని గగ్గోలు పెట్టి అరిచేవరకు ఎవరికీ మనం సలహాలూ ఇవ్వకూడదు అనే జీవిత సత్యం బాగా తెలుసుకొని ఉండడం వలన  .....


"సమస్త సమస్యోభవః సుఖినోభవంతు ...." అని దీవించి వీడ్కోలు చెప్పా .. :) :)

No comments:

Post a Comment