Thursday, November 17, 2016

మనిషి ఆదిమకాలంలో నగ్నంగానే తిరిగేవాడు ....

మనిషి ఆదిమకాలంలో నగ్నంగానే తిరిగేవాడు ....

తర్వాత ఏర్పడిన కొన్ని సాంకేతిక సమస్యల వలన ( :P ) ఆకులో ,జంతు చర్మాలో చుట్టుకొని శరీరాన్ని కప్పుకోవడం నేర్చుకున్నాడు ....అది వేరే విషయం ..... :) 

సంగతి... సమాజంలో .....చడ్డీ వేయకపోతే చేతులు అడ్డం పెట్టుకుని బయటకు రావడానికి సిగ్గుపడి ....తలుపు చాటున దాక్కున్న.... పసివాళ్ళనడిగినా ఇట్టే చెప్పేస్తారు ....

సరే ....కాలక్రమేణా వస్త్ర ధారణలో ఎన్నో మార్పులు సంభవించాయి అనుకోండి ....

ఇప్పుడు ....ఎవరు వాళ్ళ శరీరాన్ని ఎంత మేర , దాచాలి అనుకుంటారో ....అంతవరకు దాచుకుని   ....ఎంతవరకు చూపించాలి అనుకుంటారో అంతవరకు చూపించే స్వేచ్ఛ సమాజంలో చాలా మందికి ఉంది అనేది ...నిర్వివాదాంశం (వివాదాంశం కూడా కావచ్చు  :) ) ........

బయటకు సరదాగా షికారుకు వెళ్ళినప్పుడు ఒక రకమైన వస్త్రాలు , ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఒక రకం ....శుభకార్యాలకు , ప్రార్ధనా మందిరాలకు వెళ్ళినప్పుడు మరో రకం ....ఇంట్లో ఉన్నప్పుడు రకం .....పడుకునే ముందు ఇంకో రకం .....ఇలా ....వస్త్ర ధారణ / సౌకర్యంలో మార్పులు చేర్పులు ఉన్నా ....ఎవరి ఇష్టం వచ్చిన వస్త్రాలు వాళ్ళు వేసుకునే స్వేచ్ఛ అయితే మాత్రం ప్రపంచంలో ఎక్కువ శాతం మందికి ఉంది అని నిస్సందేహంగా చెప్పొచ్చు ..

======================================

అయితే మనం మాట్లాడే మాటలు కూడా వస్త్ర ధారణ లాంటివే .....

ఎవరితో ఎలా మాట్లాడాలి ,ఎంతవరకు మాట్లాడాలి .... విషయాలు మాట్లాడాలి ....ఎందుకు , సమయంలో మాట్లాడాలి అనేవి కూడా కాలానుగుణంగా, సందర్భానుసారంగా ..... మారుతూ ఉంటాయి ....

కొందరితో మనం సరదాగా మాట్లాడతాం , మరి కొందరితో పద్ధతిగా మాట్లాడతాం , ఇంకొందరితో ఇంకాస్త చనువుగా ....మరీ ముందుకు వెళితే మనసుకు దగ్గరగా ఉన్నారు అనుకున్న వాళ్ళతో మనసు విప్పి మాట్లాడతాం .....

మనసు విప్పి మాట్లాడడం అంటే ....హాయిగా పడుకునే ముందు సౌకర్యవంతంగా ఉండే డ్రెస్ వేసుకుని పడుకుంటాం చూడండి ....అలా అన్నమాట .... :) 

అయితే అరుదుగా ....కొందరు మాట్లాడితే ....ఏం విప్పుతారో , ఏం మాట్లాడతారో తెలియదు కానీ అసలు బట్టలే వేసుకోకుండా ఆదిమ మానవుడి కాలంలో మనుషులు తిరిగినట్టు .....వీళ్ళు ఇంతకు ముందు 24 గంటల్లో ఏం చేశారు ....రాబోయే 24 గంటల్లో ఏం చేయబోతున్నారు ....అనేది మొత్తం కనిపించిన ప్రతివాడికీ చెబుతూనే ఉంటారు ..... :P 

అలాంటి వాళ్ళను చూసి కూడా మనం... పోనీలే వాళ్ళ  శరీరం.. వాళ్ళిష్టం  , లేదా వాళ్ళ మాటలు వాళ్ళిష్టం  అని అనుకుని సరిపెట్టుకుంటాం .....నగ్నత్వం విప్పి చూపినా ....అర్ధం చేసుకుని , సర్దుకుని ... అవతలకు పోతాం .... :( 

కానీ అరుదుగా కొందరు ఉంటారు .....వాళ్ళ బట్టలు వాళ్ళు విప్పుకుని తిరగడమే కాకుండా ....పక్క వాళ్ళ బట్టలు కూడా లాగి మరీ అందరికీ చూపిస్తారు ..... :( :( 

అంటే ....పక్క వాళ్ళ విషయాలు అన్ని ఇతరులకు ఏకరువు పెడతారు ..... :( 

పైగా ....నా విషయాలు ఇతరులకు చెప్పే హక్కు నీకు ఎవరిచ్చారు అని అడిగితే ....అందులో తప్పేముంది ....నేను విప్పుకుని తిరుగుతున్నా కదా ....నాకేం తప్పు అనిపించలేదు .....అంటారు ..... :( :( 

నాలాగే అంతా విప్పేసుకుని తిరగాలని అనుకోవడం ....అవతలి వాళ్లకు ... సిగ్గు , ఆత్మాభిమానం, గుట్టు .... లాంటివి .... ఉంటాయని అనుకోకపోవడం ....అవి మనం విప్పి చూపించే హక్కు లేదు అని ....తెలుసుకోకపోవడం .....
వీళ్ళ అనాగరిక ఆదిమ సిద్ధాంతం .... :( 

======================================

ఇక అవతలి వాళ్ళను .....ఎవరెవరి సంగతులో ...గుచ్చి గుచ్చి అడిగి మరీ చెప్పించుకునేవాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత క్షేమంగా ఉంటాం .... :) 

దుశ్శాసనుడు ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తుంటే .....సభలో చివరన ఎవరికీ కనపడకుండా చీకట్లో కూర్చుని చొంగలు కార్చుకుని ...చప్పట్లు కొట్టిన వారి వంశంలో ఇలాంటి వాళ్ళు (ఇలా ఎవరి విషయాల్లో ఎవరెవరి దగ్గరో ఆరాలు తీసి బ్రతికేవాళ్లుపుట్టి ఉంటారేమో అని నా డౌటనుమానం ...  :) :P :P 


అచ్చమైన అనాగరికులు అంటే వీళ్ళే ....(ఇందులో అనుమానం లేదు ...)  :) :)