Wednesday, November 9, 2016

బ్రతుకంటూ బ్రతికితే ....మనిషి జన్మ మన కోసం ఆరాట పడే బ్రతుకు బ్రతకాలబ్బా ...

కొందరు ఉంటారు.....,,

వాళ్లకు మనతో ఏదైనా అవసరం ఉంటే .....మెత్తగా అడిగి ....లేనిపోని ప్రేమలు ఒలకబోసి.....వంగి వంగి దండాలు పెట్టి , మరీ వాళ్ళ పనులు చేయించుకుంటారు .....

అదే మనకు వాళ్ళతో ఏదైనా అవసరం పడితే వాళ్ళు వేసే వేషాలు అన్ని ఇన్ని కాదు .....

- టైం లేదు అంటారు
- ఇప్పుడు చెయ్యాలా అని బద్ధకం ఫేస్ పెడతారు
- చేస్తే నాకేమిస్తావ్ అంటారు
- సర్లే ... ఒక్కసారీ చేస్తా ఇంకెప్పుడూ అడగకు అని మొహం మొటమొట లాడించుకుంటూ చేస్తారు
- ఎక్కడ చేయాల్సి వస్తుందో అని మొహం చాటేస్తారు  ......,
- ఖర్మ ....ఏం చేస్తాం అని తప్పనిసరి అన్నట్టు చేస్తారు
- చేశాక ... గోరంత చేసి కొండంత చేసాం అని ప్రపంచానికి చాటింపు వేస్తారు .....,
- మనం పడుకున్నా , తింటున్నా , పనిలో ఉన్నా , నిద్రపోతున్నా నేను నీకు పని చేశాను , నిన్న , మొన్న , అటుమొన్న , నెల క్రితం , సంవత్సరం క్రితం , పదేళ్ల క్రితం , అంటూ చచ్చేవరకు ...వాళ్ళు చేసిన పనిని గుచ్చి గుచ్చి గుర్తుచేస్తూ ఉంటారు ....

వీళ్లకు మళ్ళీ ఏదైనా సహాయం అవసరం అయితే.... పిల్లి , కుక్క , పంది తదితర జంతువుల సహాయం తీసుకుని ...వాటి అవతారం ఎత్తి మనముందు ప్రత్యక్షం అవుతారు ....

వీళ్ళను చూస్తేనే మనిషి జన్మ ....వీళ్ళకెందుకు జన్మ నిచ్చానురా బాబూ అని నీళ్లు లేని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది ....

=======================

మరి కొందరు ....ఉంటారు ....,,,

వీళ్లకు ఇతరులతో ఏదైనా అవసరం ఉంటే మర్యాదగా , పద్దతిగా అడిగి .....వాళ్లకు నష్టం లేకుండా , వాళ్ళ సమయానుకూలత చూసుకుని సహాయం చేయమని అడుగుతారు ....వాళ్ళు చేయలేము అంటే ...పర్వాలేదండీ నేను మరెవరి సహాయం అయినా అడుగుతాను అని నవ్వుతూ చెప్పేస్తారు .....

చేస్తే ...,,, వాళ్లకు మళ్ళీ నేనే విధంగా సహాయం చేయగలను అని కృతజ్ఞతా పూర్వకంగా ఆలోచిస్తారు ....

వీళ్ళు ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే , అడిగిన వెంటనే , కొన్నిసార్లు అడగడానికి మొహమాటపడినా... వారి మనసు తెలుసుకుని ....వాళ్లకు చేయూతనిస్తారు ....సహాయం చేయడానికి ముందుంటారు .....
చేశాక సహాయం మరుక్షణమే మర్చిపోతారు ....సహాయం తీసుకున్న వాళ్ళే తిరిగి గుర్తుచేసినా ....
"ఎప్పుడూ .... అదా .....అదేమంత పెద్ద సహాయం అని ....మీరు కూడా మర్చిపోండి ....." అని నవ్వుతూ చెప్పేస్తారు ....

వీళ్లకు ఎవరితోనైనా మళ్ళీ అవసరం వస్తే .....కాదు కాదు, అవసరం ఎప్పుడొస్తుందా.... ఎప్పుడు సహాయం చేద్దామా అని.... ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ ఉంటుంది .... <3 

వీళ్ళను చూస్తే .....మనిషి జన్మ ....జన్మంటూ ఇస్తే ...మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాళ్లకి జన్మనివ్వాలిరా అని ఆశతో ఆరాటపడుతూ ఉంటుంది .... <3 

===================
ఏమైనా సరే ....బ్రతుకంటూ బ్రతికితే ....మనిషి జన్మ మన కోసం ఆరాట పడే బ్రతుకు బ్రతకాలబ్బా ....అది పది రోజులైతేనేం ....పది క్షణాలు అయితేనేం ...??!! <3 <3 <3 

=====================

మనిషి జన్మ అసహ్యించుకునే బ్రతుకు ..... అది బ్రతికేవాళ్లు .... ఎంతకాలం బ్రతకాలో , అసలు బ్రతకాలో వద్దో వాళ్ళే నిర్ణయించుకుంటారు .... :P :P :P 
ఆల్ బెస్ట్ .... :P :)