Wednesday, November 23, 2016

“Don't leave me….Stay with me….”

“Don't leave me….Stay with me….” “నన్ను వదిలి వెళ్ళకండి .... నాతో ఉండండి….” 
=============================
మీరు చదువుతున్నది నిజమే ....! ఇక్కడ నన్ను అంటే నన్ను అని కాదు .....
నా స్థానంలో ఎవరున్నా అని అర్ధం చేసుకోవాలి .....!
==============================

నేను అధిగమించలేని కష్టాల్లో ఉన్నానని , నాకేం లేదని ….మీకు నేనేం ఇవ్వలేనని ...నన్ను వదిలి వెళ్ళకండి .....
వాటిని అధిగమించిమీ దగ్గరకు వచ్చి ....కష్టాలు ఎదురైనప్పుడు వాటిని నేను ఎలా ఎదుర్కొన్నానో మీకు విడమరిచి చెబుతా ....అలాంటి కష్టాలు మీకు ఎదురైనప్పుడు నాలా దిక్కుతోచని పరిస్థితి మీకు ఉండకపోవచ్చు ...ఇవి కొత్త కష్టాలు కావు ....ఇంతకు ముందు ఒకరు ఎదుర్కొన్నవే అని మీకు తెలిసిరావచ్చు .....అప్పుడు మీకు పరిష్కార మార్గాలు పరిశోధించడం సులువు కావచ్చు ....
నన్ను నమ్మండి ......అందుకే నన్ను వదిలి వెళ్ళకండి ......
-----------------------------------
నేను మీకు సహాయ పడలేనని , మిమ్మల్నే సహాయం అడుగుతానేమో అని ....నన్ను వదిలి వెళ్ళకండి …..
నా కాళ్ళమీద నేను నిలబడి ....అలా నిలబడడం కోసం నేను ఎన్నిసార్లు పడ్డానో .....ఎన్నిసార్లు లేచానో ....ఎన్నిసార్లు ఆసరా కోసం ప్రయత్నించానో ...ఎన్నిసార్లు పరుగులు పెట్టానో ...ఎన్నిసార్లు ఆగిపోయానో ....ఎన్నిసార్లు ఒంటరిగా నడిచానో ...మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా .....అప్పుడు మీకు మీ దారిలో తీసే పరుగు నా కంటే త్వరగా పూర్తి చేయగల మార్గాలు తెలియొచ్చు ....
నన్ను నమ్మండి ....అందుకే  నన్ను వదిలి వెళ్ళకండి .....
-----------------------------------
నేను మీతో మాట్లాడడం లేదని , మిమ్మల్ని నాతో మాట్లాడమని అడుగుతానేమో అని .....నన్ను వదిలి వెళ్ళకండి ...
నాతో నేను మాట్లాడడం నేర్చుకోవడం కోసం ....ఎన్నిసార్లు మాటల్ని వాయిదా వేశానో ....మరెన్నిసార్లు గొంతులోనే సమాధి చేయడం నేర్చుకున్నానో  ...ఆత్మీయులని మర్చిపోయేలా చేశానో ....మౌనానికి అంకితం చేశానో ....మీకు మౌన భాష్యం చెబుతా .....అప్పుడు భవిష్యత్తులో మౌనానికే మాటలు నేర్పగల అరుదైన విద్య నేర్చుకోవడానికి మీకు మాటలు ఏర్పడొచ్చు .....
నన్ను నమ్మండి ....అందుకే  నన్ను వదిలి వెళ్ళకండి .....
-----------------------------------
నేను దుఃఖిస్తున్నానని  ....నా కన్నీళ్లు తుడవమంటానేమో అని ....నన్ను వదిలి వెళ్ళకండి .....
కన్నీటిని పన్నీరుగా మార్చడం ఎలా నేర్చుకున్నానో  .....సుడులు తిరిగే కన్నీటిని ఎలా నియంత్రించగలిగానో ....కన్నీటికి అవధులు ,ఆంక్షలు ,ఆనకట్టలు, ప్రవాహ మార్గాలు ఎలా నిర్మించానో ..... మీకు సాక్ష్యాలతో సహా చూపిస్తా ....అప్పుడు మీకు జీవితంలో ఎప్పుడూ కన్నీరు తుడుచుకోవాల్సిన అవసరమే రాకపోవచ్చు ......
నన్ను నమ్మండి .....అందుకే నన్ను వదిలి వెళ్ళకండి .....
-----------------------------------
ఒంటరిగా ఉన్నానని .....మిమ్మల్ని తోడు అడుగుతానేమో అని ....నన్ను వదిలి వెళ్ళకండి ... 
నా ఉనికి ఏమిటో గుర్తుపట్టడానికి , నేనెవరో తెలుసుకోవడానికి , నేనంటే అర్ధం చెప్పడానికి , నాకు నేను అర్ధం కావడానికి ...పరిశోధన చేసిఫలితం మీకు పంచుతా .....అప్పుడు ప్రపంచం అంతా మిమ్మల్ని గుర్తుపట్టొచ్చు ......
నన్ను నమ్మండి .....అందుకే నన్ను వదిలి వెళ్ళకండి .....
-----------------------------------
నేను జీవితంతో పోరాటం చేస్తున్నా అని, మిమ్మల్ని చేయూత ఇవ్వమంటానేమో అని ... నన్ను వదిలి వెళ్ళకండి .....
జీవితం తో పోరాటం చేసేదే జీవితాన్ని గెలిపించడం కోసం ....జీవితమే ఎప్పుడూ చూడని వినని పోరాటం ....జీవితమే ఆశ్చర్యపోయే పోరాటం ....జీవితమే గెలవాలని తపించి తనని తాను ఓడిపోవాలని ఆరాటపడే పోరాటం .....ఎలా చేశానో అర్ధం చేసుకుంటా ....మీకు అర్ధమయ్యేట్టు వివరిస్తా .....అప్పుడు మీరు మీ జీవితాన్ని ఇంకా తక్కువ సమయంలో గెలిపించే మార్గాలు తెలుసుకోవచ్చు ......
నన్ను నమ్మండి ....అందుకే  నన్ను వదిలి వెళ్ళకండి .....
==================================
ఇవన్నీ నేను మీతో చెప్పాలంటే .....నేను వెళ్లొచ్చే వరకు మీరు నాతోనే ఉండాలి .....
మళ్లీ వస్తానో లేదో అనే సందేహం మీకుంటే .....
ఇక సెలవు ... :( :( :( 
మళ్లీ తప్పక తిరిగొస్తాననే నమ్మకం మీకుంటే .....
“Do’nt leave me….Stay with me….” “నన్ను వదిలి వెళ్ళకండి .... నాతోనే ఉండండి….” <3 <3 <3 
అలా ఒక్కరున్నా చాలు ....వాళ్ళే నాకు ఆత్మీయులు .... <3 <3 <3 

No comments:

Post a Comment