Friday, November 18, 2016

ఇలాంటి అందమైన ఇబ్బందులు పెట్టే నా మనసంటే నాకు ప్రేమ

ఇప్పుడు ....జీవితంలో మనం మనిషిగా ఎంతో ఎదిగాం అని ...మనం అప్పుడప్పుడూ అయినా అనుకుంటూ ఉంటాం ....
ఎలాంటి సందర్భాల్లో అనుకుంటాం ....??!!
-ఇంతకు ముందు మనం చేసిన కొన్ని పనులు ....అప్పుడు తెలివైనవిగాను, ఇప్పుడు తెలివి తక్కువగానూ అనిపించినప్పుడు ....,,,,
-ఇంతకుముందు మనం కొందరిని ....అప్పుడు గొప్పవారిగా పూజిస్తే, వారిప్పుడు మనకు అల్పులుగా కనిపించినప్పుడు ....,,
-ఇంకా ముఖ్యంగా ...మనం ఒకప్పుడు భూన భోనాంతరాలు దద్దరిల్లిపోయే విధంగా ఏడ్చిన సమస్యలు ఇప్పుడు ఉఫ్ఫ్ అంటే ఎగిరిపోయే విధంగా కనిపించినప్పుడు ....,,,
-అతి ముఖ్యంగా ....ఒకప్పుడు మనకే అద్భుతంగా కనిపించిన మన భావాలు ఇప్పుడు చదువుతుంటే మనకే సిగ్గుగా అనిపించినప్పుడు ......,,,
అప్పుడు మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది మనం ఎంతగా ఎదిగాం అని ....,,,
విచిత్రం ఏమిటి అంటే ..ఇప్పుడు ఎంతో ఎదిగాను అని అనిపించే కొన్ని భావాలు ....కొన్నేళ్ళ తర్వాత చూస్తే నవ్వు తెప్పించొచ్చు ,సిగ్గు కలిగించొచ్చు ....కొన్ని గొప్పవిగా కూడా అనిపించొచ్చు (అప్పుడు కారణాల వలన అయినా భావాలు మనం మర్చిపోతే ...) చెప్పలేను....
ఎదగడం అనేది....ఎదిగాం అని మనం తెలుసుకోవడం అనేది .... మనల్ని మనం నిర్వచించుకోవడం అనేది ...జీవితంలో జరిగే నిరంతర ప్రక్రియ అయినా ....
మనసు మాత్రం ఎప్పటికప్పుడు తన ఫలకంపై ...పాత నిర్వచనాలు దాచేస్తుంది , క్రొత్త నిర్వచనాలు లిఖిస్తుంది ...సరిక్రొత్త నిర్వచనాల కోసం వేచి చూస్తుంది ...తను ఎదుర్కొనే అందమైన ఇబ్బందిని నిరంతరం అనుభవిస్తూనే ఉంటుంది ....
అందుకే అనిపిస్తుంది ...."మనసు మనిషికి దేవుడిచ్చిన అద్భుతమైన వరం "....అని ...,,,,
అంటే నిర్వచనం నా మనసు ఇప్పుడు రాసుకున్న క్రొత్త నిర్వచనం కావచ్చు ,,,, ఇంతకుముందు ...."మనసు మనిషికి దేవుడిచ్చిన శాపం ..." అనే పాత నిర్వచనాన్ని సిగ్గుపడి నా మనసు దాచేసి ఉండొచ్చు ....,,,,
భవిష్యత్తులో ఎదురు కాబోయే సరిక్రొత్త నిర్వచనం కోసం వేచి చూస్తూ ఉండొచ్చు .....,,,,

చెప్పలేను ....ఇలాంటి అందమైన ఇబ్బందులు పెట్టే నా మనసంటే నాకు ప్రేమ అని మాత్రం చెప్పగలను .....!!! :) :) :)

No comments:

Post a Comment