Monday, November 14, 2016

మీ పిల్లలందరికీ "బాలల దినోత్సవ శుభాకాంక్షలు....."చెప్పాలని......!!!!!


నా చిన్నతనంలో నన్ను పిల్లలకోడి అని పిలిచేవాళ్ళు....వయసుతో నిమిత్తం లేకుండా చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ నాకు స్నేహితులే......ఇంతకుముందు మా సీనియర్స్ కనిపెట్టిన ఆటలే కాకుండా....మేము ఏవేవో కొత్త ఆటలు సృష్టించాలని చూసేవాళ్ళం....అలా ఒకసారి నా స్నేహితులంతా కలిసి ఒక ఆట కనిపెట్టారు..దానిపేరే "మట్టిలో పట్టీ"..నా కాళ్ళకి ఉన్న పట్టీలు ఒకటి తీసి ఇస్తే ,అవి మట్టిలో దాచేస్తే ...మేము తర్వాత ఎక్కడ దాచారో కనిపెట్టడం.....,
అప్పుడే కొత్తగా కొన్న పట్టీలు ....పడిపోతాయని మా అమ్మ అన్నా వినకుండా....మా నాన్నతో సిఫార్సు చేపించి మరీ పెట్టుకున్నాను.....అయినా ఫ్రెండ్స్ అడిగినప్పుడు మనం కాదు అనం కదా.....చాలా సార్లు ఆట ఆడాం.....మట్టిలో దాచిన పట్టీ దొరికినప్పుడల్లా మురిసిపోయాం.....చివరికి ఇక ఇంటికి వెళ్లిపోతాం  అనగా జరిగింది.....ఒక అద్భుతమైన సంఘటన....మట్టిలో దాచిన పట్టీని కనిపెట్టలేకపోయాం...... :)
ఇంటికెళ్ళాక అంతకంటే అద్భుతంగా నా వీపు విమానం మోత మోగిందనుకోండి.......
తర్వాత పెద్దవాళ్లందరూ.....చిన్నపిల్లల్లా "మట్టిలో పట్టీ"ఆట ఆడుకుంటుంటే..... నవ్వకుండా ఉండలేక ..ఏడుస్తున్నట్టు నటించలేక, మేము అనుభవించిన బాధ వర్ణించలేనిది......!!! :)
పిల్లలందరూ పేస్ బుక్ లోకి వచ్చి చూడలేరు కాబట్టి .....ఇక్కడున్న పేరెంట్స్ అందరికీ....మా వీధిలో వయ్యారంగా రంగులు ఒలికిస్తున్న ఈ చెట్టు సాక్షిగా మనవి చేస్తున్నా....!!!!!

మీ పిల్లలందరికీ "బాలల దినోత్సవ శుభాకాంక్షలు....."చెప్పాలని......!!!!!

=====================
(గమనిక : ఈ ఆర్టికల్ నవంబర్ 14 , 2013  తేదీన వ్రాశాను ...)

No comments:

Post a Comment