Saturday, July 15, 2017

నిజం /అబద్ధం చెప్పడం అనేవి ఒక అలవాటు వలన కూడా ఏర్పడతాయి ....

గమనిక : నిజం చెప్పడం ఒప్పు ,అబద్ధం చెప్పడం తప్పు అని ...ఏది నిజం, ఏది అబద్ధం అని .....సమాజం నిర్వచించిన నిర్వచనానికి ...తప్పొప్పుల తర్కానికి ....అతీతమైన పోస్ట్ .....
=========================
చాలా వరకు సినిమాలన్నీ ….
మొదటి భాగం అంతా ప్రశ్నలు ,ఉత్కంఠ , కథ గురించి కాస్త అయోమయం ....ఇలా సాగిపోతుంది .....
రెండవ భాగం అంతా ...ఆ ప్రశ్నలకు జవాబులు ....ఉత్కంఠ విడిపోవడం ....అయోమయం అర్ధం కావడం ...ఇలా సాగిపోతుంది .....
జీవితం కూడా అంతే ....
ఊహ తెలిశాక ఎన్నో ప్రశ్నలు ...."ప్రపంచం ఇలా ఉందేమిటి ....సమాజం ఇలా ఎందుకు ఉంది ....మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ....నేను అలాగే ఎందుకు ప్రవర్తిస్తున్నాను ....." అని ....
కొంత జీవితం గడిచాక ...
ఒక్కో ప్రశ్నకు జవాబు దొరికి ....అర్ధమై ....ఉత్కంఠ ,అయోమయం విడిపోతూ ఉంటాయి .....సింపుల్ గా దానినే జ్ఞానోదయం అంటామనుకోండి .. 
నాకు కూడా ఇలానే చాలా జ్ఞానోదయాలు అవుతూ ఉంటాయి ....  
ఈ మధ్య కలిగిన ఒక జ్ఞానోదయం విషయానికొస్తే ....,,,,,
-----------------------
ఇదివరకు ఎవరైనా అబద్ధాలు చెప్పే వ్యక్తులను చూసినప్పుడు ....నాకు ఆశ్చర్యం వేసేది ,ఒకింత అసహ్యం కలిగేది .....ఏదో అవసరానికి అబద్ధాలు చెప్పడం సరే కానీ ...నోరు తెరిస్తే అబద్ధాలు ఎలా చెప్పగలరు వీళ్ళు అనుకునేదాన్ని ....అదొక వ్యసనం అని కూడా నిర్ధారణకు వచ్చేదాన్ని .....
ఎందుకు వీళ్ళు అవసరం లేకపోయినా అబద్ధం చెబుతున్నారు ....అదొక అలవాటుగా చేసుకున్నారు ....అని ఎన్నోసార్లు ఆలోచించా ....
ఎంత ఆలోచించినా అదొక అర్ధం కాని ప్రశ్నగా మిగిలే ఉంది ..... 
అయితే ఈ మధ్య నేను కూడా కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పాల్సిన స్థితి ఎదురైంది ... 
అబద్ధం చెబుతున్నప్పుడు .....నేను కొన్ని లక్షణాలు ఏర్పడడం గమనించా .....
"నిజం చెప్పినంత ధైర్యంగా అబద్ధం చెప్పలేక పోవడం ,
నిజంగా అది నిజమేనా అని అడిగినప్పుడు నిజమే అని నొక్కి చెప్పలేకపోవడం ,
అటు పదం ఇటు ఇటు పదం అటు చెప్పి తడబడడం ,
గొంతు కాస్త నెమ్మదించడం ,
మాటలు స్పష్టత లోపించడం ,
మొహం అంతా ఒక విధమైన అసౌకర్యానికి గురి కావడం ,
నేను చెప్పేది అవతలి వాళ్ళు నమ్ముతున్నారా లేదా అనే అపనమ్మకం వలన ఆందోళనకు గురికావడం ....
అబద్ధం చెప్పడం అయిపోయాక ఒక విధమైన హాయికి లోనై హమ్మయ్య అనుకోవడం ....
నాకు తెలియకుండానే అరచేతుల్లో చెమటలు పట్టడం ....." ఇలా …
మరి తరచూ అబద్ధం చెబుతున్న వాళ్ళు కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా అని ఆలోచించా .....
ఇలాంటివేమీ వారిలో నేను ఎప్పుడూ గమనించలేదు ....
మనం నిజం చెప్పినంత ఈజీగా వాళ్ళు అబద్ధాలు చెప్పేస్తున్నారు .....అంటే వాళ్లకు అబద్ధం చెప్పడం అనేది అలవాటుగా మారింది .....
నిజం చెప్పాలంటే వాళ్ళు నిజం చెబుతున్నప్పుడు ఇలాంటి లక్షణాలు వారిలో ఏర్పడడం నేను గమనించాను ....
అంటే....,,, వాళ్లకు నిజం చెప్పడం అనేది చాలా కొత్తగా ఉంది ....
నిజం చెబుతున్నప్పుడు అచ్చు పైన పేర్కొన్న లక్షణాలు ఏర్పడుతున్నాయి అని కూడా గమనించా .....
అంతే .....ఉత్కంఠ ,అయోమయం విడిపోయింది ....చాలా ప్రశ్నలకు నాకు సమాధానం దొరికింది ..... 
--------------------------------------------------
నిజం /అబద్ధం చెప్పడం అనేవి ఒక అలవాటు వలన కూడా ఏర్పడతాయి ....
ఆ అలవాటు అంత త్వరగా మార్చుకోలేరు ....
నిజం చెప్పే అలవాటును మార్చుకోవడం ఎంత కష్టమో ,అబద్ధం చెప్పే అలవాటును మార్చుకోవడం కూడా అంతే కష్టం ....
ఇకనుండి నా ముందు ఎవరు అబద్ధం చెప్పినా ....అది వాళ్ళ అలవాటు అనుకుంటాను అని తల్చుకుంటే ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను .... 
ఇంతకు ముందు వాళ్ళ మీద నాకు కలిగే కోపం ఇకనుండి ఉండదు ..వాళ్ళని వేరే కోణంలో అర్ధం చేసుకోబోతున్నాను ..... 
చాలా చాలా చాలా సంతోషంగా ఉంది ....ఇకనుండి వాళ్ళను అభినందించాలి ....నిజం చెప్పే లక్షణం లాగానే అబద్ధం చెప్పే లక్షణాన్ని అతి కష్టం మీద వాళ్ళు అలవాటు చేసుకున్నందుకు ........ 
----------------------------------------
నాకు అబద్ధం చెప్పే అవసరం కలిగించి ....వాళ్ళను అర్ధం చేసుకునే శక్తిని ...అవకాశాన్ని నాకిచ్చినందుకు ....భగవంతుడికి/ నా జీవితానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా .....!!!  

No comments:

Post a Comment