Saturday, May 6, 2017

ఒక లక్ష్యాన్ని సాధించడంలో ఉన్న సంతృప్తి ....

ఒక లక్ష్యాన్ని సాధించడంలో ఉన్న సంతృప్తి ....సాధించాక ఫలితాన్ని అనుభవించడంలో ఉండదు ... :(
లక్ష్యాన్ని సాధించేటప్పుడు .....,,,,,
ప్రణాళిక , పట్టుదల , ఆశ పడడం , అంతలోనే అందకపోతే నిరాశకు లోనవడం , అందుకోలేక పడడం, మళ్ళీ చేరుకోవాలని శక్తి కూడదీసుకుని లేవడం , కొందరిని అనుసరించడం , మరి కొందరి కాళ్ళు మొక్కడం (అంటే నిజంగా కాదు ...) , కొన్ని అబద్ధాలు చెప్పడం , ప్రతిరోజూ మన ప్రవర్తనను సమీక్షించుకోవడం , మనల్ని మనం సరిదిద్దుకోవడం , కొన్ని ఇష్టమైన ఆనందాలు త్యాగం చేయడం , మరి కొన్ని కష్టమైన నిష్టూరాలు ఆస్వాదించడం .....ఇలా ఎన్నో భావాల తపస్సు , కృషి ఫలితమే ఓ లక్ష్యాన్ని సాధించడం ...... <3
ఫలితాన్ని ఆస్వాదించడంలో ఇవన్నీ ఉండవు ....ఆస్వాదించడం మాత్రమే ఉంటుంది ..... :)
అయితే లక్ష్యం సాధించడంలో ఉన్న జీవితాన్ని ఆస్వాదించిన వ్యక్తి (అమాంతం అందలం ఎక్కకుండా ) ఒక లక్ష్యం పూర్తయిన వెంటనే మరో లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా ఉండలేడు ...మళ్ళీ ప్రణాళికతో లక్ష్యాన్ని మొదలు పెట్టడం....జీవితాన్ని ఆస్వాదించడం అనివార్యం ..... <3 <3

No comments:

Post a Comment