Friday, May 12, 2017

ఈ GPS జాబ్ 20 ఏళ్ళ నుండి చేస్తున్నా ....

సమయం అర్ధరాత్రి పన్నెండు అయింది ....
వాషింగ్టన్ ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వచ్చా ...
కొద్దిగా చలిగా అనిపించింది ....
ఫ్లైట్ లాండ్ అవగానే ...మావారు కారు తీసుకుని వస్తాను అన్నారు కదా అని ఫోన్ చేశా ....
"అప్పుడే వచ్చేసిందా ఫ్లైట్ ...ఇప్పుడే బయలుదేరాను ....అరగంటలో అక్కడ ఉంటాను ...."అన్నారు ఆశ్చర్యంగా....
"కంగారేం లేదు ...నెమ్మదిగా రండి ....నేను వెయిట్ చేస్తాను ..." చెప్పా ..
కాసేపట్లో మళ్ళీ ఫోన్ ....."కార్ కీస్ ఎక్కడ పెట్టానో కనిపించలేదు ....వెతుకుతున్నాను ...పాప నిద్రపోయింది ....తన రూమ్ లో ఉన్నట్టున్నాయి .." అవతలి నుండి మావారు ....
"పర్వాలేదు ....వెతకండి ....తర్వాత కాల్ చేయండి ....ఎక్కువ ఛార్జింగ్ లేదు నా ఫోన్ లో ...." చెప్పా ....
మళ్ళీ కాసేపాగాక ....మళ్ళీ ఫోన్..."కీస్ కనిపించలేదు ...." తన గొంతు ....
"పర్వాలేదు ....నేను కాబ్ తీసుకుని వస్తా ...." నవ్వుతూ చెప్పా ....
ఎవరో నా కోసం రావాలని , వస్తారని నేను ముందుగానే ఊహాగానాలేవీ చేయకపోవడం వలన ...నాకు అదేం పెద్ద సమస్యగా అనిపించలేదు ....
"కాబ్ బుక్ చేస్తాను ..." చెప్పారు ...
కాసేపటికి కాబ్ వచ్చింది ....ఎక్కి కూర్చున్నా ....
ఇంటికి రావడానికి అరగంట పడుతుంది ....
'హౌ అర్ యు డూయింగ్ " అడిగాడు కాబ్ డ్రైవర్ ....
"ఫైన్ ...థాంక్స్ " అన్నా ....
మళ్ళీ బయల్దేరాక 'హౌ అర్ యు డూయింగ్ " అన్నాడు ...
ఓర్నీ ...ఇప్పుడే కదా చెప్పా ....బాగానే ఉన్నాను ....అని ....మళ్ళీ ఏంటి అనుకుని ....
మళ్ళీ "ఫైన్ థాంక్స్" అన్నా ....
ఎందుకో అతను నేను చెప్పింది వినిపించుకున్నట్టు కూడా లేదు ....
పొద్దుటినుండి ప్రయాణం ..నేనూ అలసిపోయి ఉన్నా ....అందుకే అతన్ని కదిలించలేదు .....
ఎవరూ ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా .....స్వతంత్రంగా బ్రతకడానికి దోహదపడేలా పుట్టుకొచ్చిన కొత్త వింతల్లో ఈ ఊబర్ ఒకటి .....App ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుని ...క్రెడిట్ కార్డు నంబర్ ఇచ్చి ....ఎక్కడికి పోవాలో అడ్రస్ చెప్తే చాలు ....మనం ఉన్న చోటు కూడా వాడే కనుక్కుని ఎంచక్కా ఎక్కించుకుని పోయి ....అక్కడి కెళ్ళాక ఒకరేటు , ఎక్కినప్పుడు ఒకరేటు అని ....చిల్లర లేదని ....ఇలాంటి పేచీలు లేకుండా ....ముందే ఎంత అవుతుందో చెప్పేస్తాడు .....
మనం కాబ్ ఎక్కాక మనల్ని చక్కగా మాట్లాడించడం ఎందుకు చేస్తాడు అంటే ....దిగాక మంచి రేటింగ్ ఇస్తామని ....(ఇప్పుడు ఇది తీసేసాడు అనుకోండి )
అందులో భాగంగానే పాపం అతను నన్ను పలకరించాడు ....
నేనూ అతనికి సమాధానం చెప్పా .....
కానీ అతనిలో / నాలో ఒకటే లోపించింది ....హుషారు ....
ఒకటి మాత్రం పుష్కలంగా కనిపించింది ....నీరసం .....
సరేలే .... అని ....అలసి పోయి ఉండడం వలన కళ్ళు మూసుకుని కాసేపు తల వెనక్కి వాల్చా ...
పక్కనే లైట్ గా మ్యూజిక్ వినిపించింది ....ఏంటా అని చూశా ....పాటలు హెడ్ ఫోన్స్ లో పెట్టుకుని వింటున్నాడు డ్రైవర్ ....
అప్పుడు చూశా అతనివైపు ....ఓ పాతికేళ్ళు ఉంటాయనుకుంటా ....
స్టూడెంట్ లా అనిపించాడు .......
సాధారణంగా అలా పాటలు వినకూడదు డ్రైవ్ చేసేటప్పుడు ....పోనీలే పాపం పొద్దుటినుండి కాబ్ నడుపుకుని అలసిపోయి ఉన్నాడేమో అనుకున్నా .....
మళ్ళీ ...ప్రకృతిని ఆస్వాదించడంలో మునిగిపోయా ....
అప్పుడు అనిపించింది ....చాలామంది రాత్రిపూట ప్రకృతిని ఏం చూస్తాం అనుకుంటారు కానీ ....రాత్రి మాత్రం ప్రకృతి ఎందుకు అందంగా ఉండదు అనిపించింది .....
జుట్టు విరబోసుకున్న దయ్యాల్లా రోడ్డుకిరుపక్కలా చెట్లు పగలు కనిపించవు కదా ....ఆకాశం సగం చీకటి సగం వెలుగు నింపుకుని ముసురేసినట్టు కనిపించింది .....డైరెక్షన్ బోర్డులు అప్పుడప్పుడూ మెరుస్తూ చదివేలోగా మాయం అవుతూ ....ఎంతో విచిత్రంగా చూస్తూ ఉండిపోయా ....ఎందుకో ప్రకృతి ని చూడడం ఎన్నిసార్లు చూసినా నాకు ఎప్పుడూ విసుగనిపించదు .... <3
అంతలో ....పక్కన ఆ పిల్లాడు కాస్త అటూ ఇటూ ఊగుతూ .....రెండు లేన్లు మధ్యలో కారు నడుపుతున్నాడు .....
వెనక నుండి ఎవరైనా స్పీడ్ గా వస్తే ....??? అనిపించింది
స్టీరింగ్ మీద చేతులు చాలా నిర్లక్ష్యంగా మార్చి మార్చి వేస్తున్నాడు ....
నాకు అర్ధమైంది ....ఈ పిల్లాడికి పాపం కాబ్ నడపడం ఇష్టం లేదు ,,,,కానీ బ్రతుకు తెరువు కోసం తప్పదు అని నడుపుతున్నాడు అనుకుంటా ....
ఒక్క క్షణం జాలేసింది....పోన్లే ఎలా అయినా నడపనీ ....ఎలాగైనా ఏదో ఒక పని చేసుకుని బ్రతకాలని ఆరాటం గొప్పది కదా అనుకున్నా ....
అంతలో "take this exit'అన్నా ....ఒక్కసారిగా ....
" ఓ సారీ ....' అని ఒక్క క్షణంలో.. మిస్సవ్వ బోయిన ఎగ్జిట్ తీసుకున్నాడు ....
ఎగ్జిట్ మిస్సయితే మళ్ళీ ఓ పదినిమిషాలు తిప్పి తిప్పి చంపుతుంది ....GPS...
హమ్మయ్య అనుకున్నా .....
ఇక తప్పదు అని ....మళ్ళీ GPS డ్యూటీ వచ్చింది అని ....ఎలర్ట్ అయ్యా ....
"go straight, use local lanes, take next exit, take right"
ఇలాంటివి చెప్తూ మొత్తానికి ఇంటికి వచ్చా .....
మధ్యలో .....ఏం చేస్తున్నావ్ ....చదువుకుంటున్నావా అడిగా ....
లేదు మానేశాను ....అన్నాడు ....ఇక్కడికి కాబ్ నడుపుకోవడానికి వచ్చా అన్నాడు ...ఎక్కడినుండి వచ్చావ్ అని అడిగా ....టర్కీ నుండి అని చెప్పాడు ....
చీకట్లో కూడా రోడ్లన్నీ గుర్తుపెట్టుకుని మరీ చెబుతుంటే ....అడిగాడు ...."ఎన్నేళ్ల నుండి మీరు ఇక్కడ ఉంటున్నారు" అని ....
"ఉంటుంది తక్కువే ....కానీ ఈ GPS జాబ్ 20 ఏళ్ళ నుండి చేస్తున్నా ...."నవ్వుతూ చెప్పా ....
=====================
ప్రతి ఒక్కరి వెనుకా ఒక జీవితం ఉంటుంది ....ప్రతి జీవితం వెనుకా ఒక కథ ఉంటుంది ..... ప్రతి కథ వెనుకా ఒక బ్రతుకు పోరాటం ఉంటుంది ....అది అర్ధం చేసుకుంటే ....అస్సలు కోపం అనేదే రాదు ఎవరిమీదా ....
ఈ రోజు నాకు ఎవరి మీదా కోపం రాలేదు ....అందుకే చాలా సంతోషంగా అనిపించింది ...... <3 <3