Sunday, May 28, 2017

బ్రతుకంటే భయపెట్టడం తప్ప .....బ్రతుకే లేకుండా చేయలేవు .....!

కొంతమంది మనకు సంతోషం కలిగినప్పుడు మనకు దగ్గరవుతారు .....
వాళ్ళ ఉద్దేశ్యం, మన సంతోషం పంచుకోవడం కావచ్చు ....లేదా వాళ్ళ దుఃఖం తగ్గించుకోవడం కావచ్చు ...
కొందరు మనకు దుఃఖం కలిగినప్పుడు దగ్గరవుతారు ...
వాళ్ళ ఉద్దేశ్యం మన దుఃఖం పంచుకోవడం కావచ్చు ...లేదా వాళ్ళ సంతోషం తగ్గించుకోవడం కావచ్చు ......
ఏది ఏమైనా .....
మన దుఃఖం పంచుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తే ....వాళ్ళు ధైర్యవంతులని అర్ధం .....వాళ్లకు వాళ్ళ దుఃఖాన్నే కాదు ....ఎదుటివాళ్ళ దుఃఖాన్ని కూడా భరించగలిగే గుండె ధైర్యం ఉందని అర్ధం .....అదే దుఃఖాన్ని ఎక్కడ పంచుకోవలసి వస్తుందో అని ఆ సమయంలో పారిపోతే ....వాళ్లంత పిరికివాళ్ళు ఈ ప్రపంచంలో లేరని అర్ధం .....వాళ్ళ దుఃఖం కూడా ఎదుటి వాళ్ళ మీద తోసే ప్రమాదకారులని అర్ధం ...వాళ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని అర్ధం ....
మన సంతోషం పంచుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తే ....మనం ధైర్యవంతులం అని అర్ధం ....మన దుఃఖాన్ని మనం భరించడమే కాదు .... మన సంతోషాన్ని ఎదుటివాళ్ళకు పంచే ...గుండె ధైర్యం మనకుందని అర్ధం ....
ఏది ఏమైనా నేను గమనించినదాన్ని బట్టి.... ఎక్కువ శాతం మంది మనుషులు ఎప్పుడూ మనం సంతోషంగా ఉన్నంత కాలం మన చుట్టూ ఉంటారు ....మనం దుఃఖంలో ఉంటే మన నుండి దూరం జరుగుతారు .....
మన విజయాల్లో మనల్ని అంటిపెట్టుకుని ఉంటారు .....మన అపజయాల్లో మనల్ని ఎడారుల్లో వదిలేసి పోతారు .....
అన్ని మన దగ్గర ఉంటే మనల్ని ప్రేమిస్తారు .....ఏమీ లేకుంటే మనల్ని ద్వేషిస్తారు .....
అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ....
అపజయాల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మన దగ్గర ఏమీ లేనప్పుడు... మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలి .....మనలో మనం సంతోషం ఎలా సృష్టించుకోవాలి .....మన జీవితం మనం ఎలా జీవించాలి ....అని .....
అది నేర్చుకుంటే మిగతావన్నీ అప్పుడప్పుడు వచ్చే పిల్ల తుఫానుల్లాంటివి .....
బ్రతుకంటే భయపెట్టడం తప్ప .....బ్రతుకే లేకుండా చేయలేవు .....!

No comments:

Post a Comment