Sunday, May 28, 2017

ఇతరుల కష్టాలు కొందరికి డ్రగ్స్ లాంటివి ....

ఇతరుల కష్టాలు కొందరికి డ్రగ్స్ లాంటివి ....అలాంటి డ్రగ్స్ తీసుకునే
ప్రమాదకరమైన వ్యక్తులకు .....మనం దూరంగా ఉండాలి .....
కొందరు ఏం చేస్తారంటే .....మన కష్టాలు విని మనకు సానుభూతి చూపిస్తున్నట్టు నటిస్తూ ....ఆ కష్టాన్ని ఇంకా ఇంకా మనం చెప్పేలాగా ప్రశ్నిస్తూ ఉంటారు .....
మనం వాళ్ళు సానుభూతి చూపిస్తున్నారు కదా అనుకుని ఇంకా లోతుగా విషయాన్ని చర్చిస్తాం ....అసలు అలా మనం చెప్పేస్తున్నాం అని మనకు తెలియకుండానే మనం చెప్పేస్తాం కొన్నిసార్లు .....వాళ్ళ ప్రశ్నలు కూడా అలాగే ఉంటాయి ......
ఉదాహరణకు ...మనం విపరీతమైన కష్టం వచ్చి బాధపడుతున్నాం అనుకోండి ....ఒకసారి మనపై సానుభూతి చూపిస్తారు ....అప్పుడు మనము చాలా బాధలో ఉన్నాం కనుక ....వాళ్ళు చాలా ఆత్మీయులుగా కనిపిస్తారు .....మనం కూడా వాళ్ళ సానుభూతిని స్వీకరించి ....ఆసరాగా చేసుకుని త్వరగా కోలుకోవాలని ప్రయత్నిస్తాం .....
మళ్ళీ ఓ వారం పోయాక వస్తారు .....సహజంగానే అప్పటికి కాస్త జన జీవన స్రవంతిలో పడిపోతాం మనం ....కానీ ఆ బాధ తాలూకు గాయం , వాళ్ళ ఓదార్పు తాలూకు కృతజ్ఞత ఇంకా మిగిలే ఉంటాయి ....వాళ్ళు మళ్ళీ ఇదివరకు లాగే సానుభూతి ప్రదర్శిస్తారు .....
ఆ కష్టం ఎలా వచ్చింది ....ఎందుకు వచ్చింది ....వచ్చినప్పుడు మనం ఎంత బాధపడ్డాం ......మనం అప్పుడు ఎంత హృదయవిదారకంగా ఏడ్చాము ....తదితర విషయాలు .....గంటల తరబడి నింపాదిగా పదే పదే చర్చిస్తూ కూర్చుంటారు .....మనం కూడా వాళ్ళతో ఆ కష్టం గురించి షేర్ చేసుకుంటాం ....
మళ్ళీ కొన్నాళ్ల తర్వాత ....మనం బాధ తాలూకు గాయం బాధపెడుతున్నా .....బాధ్యతను గుర్తెరిగి దాన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం ....అయితే ఇదివరకు ఉన్నంత బాధ మనలో ఉండదు .....
వాళ్ళు మళ్ళీ వచ్చి అదే రకమైన పరామర్శలు మొదలు పెడతారు ....వాళ్ళు వచ్చారు కాబట్టి ....మనం ఎక్కువ బాధపడానికి ప్రయత్నిస్తాం .....మనకు తెలియకుండానే ....
కానీ మేం సాధారణ స్థితికి వచ్చాము ....మీరు కూడా మర్చిపోండి అని వాళ్లకు పరోక్షంగా తెలియజేయాలని ప్రయత్నిస్తాం .....అయినా వాళ్ళొచ్చిన పని వాళ్ళు కానిస్తారు .....
కాబట్టి అలాంటి వాళ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండడం ఎలాగో గుర్తించకపోతే ....మనం కూడా ఆ డ్రగ్ కి అలవాటు పడే ప్రమాదం ఉంది ....😥

No comments:

Post a Comment