Sunday, May 14, 2017

నేను నేనే ....

నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా ....అవి అబద్ధం అని నాకు అణువంత అనుమానం రాదు ....అవి నిజాలే అని నమ్మి ....ఆనక అబద్ధాలని తెలుసుకుని నువ్వు అబద్ధాల కోరువి అని నిర్ణయించుకుంటా ....కానీ మళ్ళీ నువ్వు అబద్ధం చెప్పినప్పుడు నమ్మడం మాత్రం మర్చిపోను ....అందుకే నేను నేనే ...😎

నేనెన్ని నిజాలు చెప్పినా ....అవి నిజం అని నీకు అణువంత నమ్మకం రాదు .....అవి అబద్ధాలే అని నమ్మి ....ఆనక నిజాలని తెలుసుకుని నేను నమ్మకాల మేరుని అని నిర్ణయించుకుంటావు ....కానీ మళ్ళీ నేను నిజం చెప్పినప్పుడు అనుమానించడం మాత్రం మర్చిపోవు ....అందుకే నువ్వు నువ్వే ...🤔