Thursday, May 25, 2017

మనం మంచి మనుష్యులమా ...చెడ్డ మనుష్యులమా

మనం మంచి మనుష్యులమా ...చెడ్డ మనుష్యులమా అని ....మనకే కొన్నిసార్లు సందేహం కలుగుతూ ఉంటుంది ... :(
సందేహం లేకుండా మనం మంచివాళ్ళమే అని మంచివాళ్ళుగా ఉన్నప్పుడు ....సందేహం లేకుండా మనం చెడ్డ వాళ్ళమే అని చెడ్డ వాళ్ళుగా ఉన్నప్పుడు ... మనం భావిస్తూ ఉంటాం .... :) :P
అయితే సమాజంలో మనం మనుగడ సాగించాలి అంటే మన సహజ స్వభావాన్ని పక్కన పెట్టి ....కొన్ని సార్లు మంచివాళ్ళుగా ....కొన్నిసార్లు చెడ్డ వాళ్ళుగా నటించాల్సి వస్తుంది .....అది చాలా ముఖ్యమైన విషయం .... :)
కొన్ని సార్లు మనం మన పక్కన ఉన్న వాళ్ళ కోసం కూడా ...అంటే మన జీవితాలు వాళ్ళ జీవితాలకు అంకితం చేయాల్సి వచ్చినప్పుడు ....మంచి / చెడ్డ వాళ్ళుగా నటిస్తూ ఉంటాం (జీవిస్తూ ఉంటాం :P ) .....ఇది కూడా ముఖ్యమైన విషయమే ...కానీ ఖచ్చితంగా వేరే టాపిక్ .... :P
మంచి ,చెడు ...లలో ఇదే మన సహజ స్వభావం అని మనకు ఎలా తెలుస్తుంది అనేది ఒక సమాధానం స్పష్టంగా లేని ప్రశ్న ..... ఇది ఎవరి దృష్టిలో అనేది కూడా సమాధానం అస్పష్టంగా ఉన్న ప్రశ్న :( :(
నేనయితే ....,,,,
చిన్నతనం నుండి నేను పెరిగిన వాతావరణం ,పరిస్థితులు , వ్యక్తులు, సమాజం నా మీద చూపే ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని ....నా శరీరం ,మనసు ....ఏ పనులు చేస్తే హాయిగా ,సంతోషంగా ఉంటుందో ....ఆ పనులు ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటా .... :) అవే మంచి పనులు అనుకుంటూ ఉంటా .. :)
అంతకు ముందు ఎవరెవరి కోసం ఎలా ఉన్నా ....
గత కొన్ని సంవత్సరాలుగా ....
మంచి పనులే చేస్తూ ,
మంచి ఆలోచనలే ఆలోచిస్తూ ...,
అందరిలో మంచినే చూస్తూ ....,
మంచిగా ....,
మంచిలో బ్రతుకుంటూ ఉంటే ....,,,,నా మెదడు ,మనసు ,శరీరానికి ....చాలా హాయిగా ఉంది .. <3 <3 <3
మళ్లీ అమ్మ ఒడిలో ఉన్నంత సుఖంగా ఉంది .... <3
మల్లె పూల పరిమళం అంత సుమధురంగా ఉంది .... <3
అప్పుడే అనిపించింది ....ఇదే నా అసలు వ్యక్తిత్వం ....మంచితనమే నాకు సరిపడే మనస్తత్వం అని .... :)
కానీ ....అలా నన్ను ఉండనివ్వని సమాజం ....దాన్ని అలుసుగా తీసుకుని చేతగాని తనం అనుకున్నప్పుడు ....తప్పనిసరిగా ....అవసరం అయితే చెడ్డతనం కూడా ప్రదర్శించగలను...అని వాళ్లకి చూపించాల్సి వచ్చినప్పుడు మాత్రం ....,,,,
అలావాటు తప్పిపోయిన మనస్తత్వం మళ్లీ చూపించాలి అంటే ....దానికి చాలా ప్రిపరేషన్ అవసరం ....
అలాంటి ప్రిపరేషన్ నాకు ఈ మధ్య అవసరం అయింది .... :(
కానీ అది ప్రదర్సించాక మళ్లీ నా అసలు వ్యక్తిత్వం లోకి రావడం మాత్రం మర్చిపోలేదు ....పరకాయ ప్రవేశం లాగా ..... :) :P <3

No comments:

Post a Comment