Sunday, May 28, 2017

ఇంట గెలిచి రచ్చ గెలవాలి

సామాజిక పరంగా , కుటుంబపరంగా , వ్యక్తిగతంగా ......మనం నివసించే పరిసరాలను రెండు భాగాలుగా విభజించుకోవచ్చు .....ఒకరు బయట ప్రపంచం అయితే , మరొకరు కుటుంబ సభ్యులు .....
మనం కుటుంబ సభ్యులతో ఉన్నంత చనువుగా బయట వాళ్ళతో ఉండలేం .....అలాగే బయట వాళ్ళతో ఉన్నంత దూరంగా కుటుంబ సభ్యులతో ఉండలేం .....
కొన్ని పరిస్థితుల్లో దీనికి వ్యతిరేకంగా కూడా కొందరు చేస్తూ ఉంటారు .....వారి గురించి మనం వేరే మానసిక కారణాలు చెప్పుకున్నప్పుడు చర్చించుకుందాం .....
-----------------------------
కొందరు .....బయటవాళ్ళతో చాలా చనువుగా ఉండి .....అసలు వాళ్ళే కుటుంబం అన్నట్టు ఉండి .....ఇంటికి రాగానే అద్దె ఇంటికి వచ్చిపోయినట్టు ప్రవర్తిస్తారు .....ఇంట్లో ఏవైనా ఉన్నాయా లేవా అని వీళ్లకు పట్టదు ....ఎదో తినడానికి ముష్టి వాళ్లకు వేసినట్టు తిండికి సరిపడా డబ్బులిస్తున్నాం కదా అంటారు .....
బస్టాండ్ లో కూర్చుని అరటి పళ్ళు తిని అరటి తొక్కలు విసిరి పడేసినట్టు, కిళ్ళీ వేసుకుని బస్సు మీద సగం , నడిచే దారిలో సగం పడేలా ఉమ్మేసినట్టు ,
జేబులో ఉన్న కాగితాలన్నీ సర్దుకుని అందులో పనికి రాని కాగితాలు ఉండచుట్టి విసిరేసినట్టు ,
సిగరెట్ తాగి ....పొగను పక్కన ఉన్న వాళ్ళ మొహం మీద ఊది....చివరన మిగిలిన ముక్కను ఆర్పడానికి కూడా బద్ధకం వేసి చిన్న పిల్లలు నడిచి వస్తున్న దారిలో పడేలా విసిరేసినట్టు .....
బాత్ రూమ్ కి వెళ్లి నీళ్లు పోయకుండా ..అక్కడ ఉన్నవాళ్ళతో శుభ్రంగా లేవు అని గొడవ పెట్టుకుని డబ్బులు ఇవ్వకుండా వచ్చినట్టు ....
వీళ్లకు ఇల్లంటే పబ్లిక్ బస్టాండ్ ......
మళ్ళీ బయట వాళ్ళ దగ్గరకు పోగానే ...అదే తమ సొంత కుటుంబం అయినట్టు ప్రవర్తిస్తారు....
నాకు ఇలాంటి కుటుంబం ఉంటే బాగుండేది ....నన్ను మా వాళ్ళు రాచి రంపాన పెడుతున్నారు .....నన్ను వాళ్ళు ప్రేమించడం లేదు .....ఇంటికి పోతే నరకంలా ఉంది .....అని అందరి దగ్గరా ప్రేమను అర్థిస్తూ బ్రతుకుతారు .....
పోయిన దగ్గరనుండి ....ఇంట్లో వాళ్ళను ఎదుటివాళ్ళ దగ్గర తిడుతూ బ్రతికేస్తారు ....
ఇక మరి కొందరు ....బయట వాళ్ళ దగ్గర ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండి....ఇంటికి రాగానే అదే తమ ప్రపంచంలా బ్రతికేస్తారు .....
మరి కొందరు .....ఇంట్లోనూ బయట ....ఎవరికీ పనికి రాకుండా బ్రతికేస్తారు .....
-------------------------------
ఏది ఏమైనా .....ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని మన పెద్దవాళ్ళు చెప్పినట్టు .....
ఇంట్లో ఉన్నవాళ్ళ ప్రేమను , అభిమానాన్ని పొందలేకపోయినవాళ్ళు ....ప్రపంచాన్ని ఉద్దరించడానికి బయలుదేరితే .....ప్రపంచం మొహంమీద ఛీ కొడుతుంది అనేది మర్చిపోకూడదు ..... !!

No comments:

Post a Comment