Saturday, May 27, 2017

జగమంతా ప్రేమ మయమే కదా ...

మనకు కొందరిని చూస్తే భయం వేస్తుంది ....
కొందరిని చూస్తే సిగ్గేస్తుంది (ఒక్కరినే కూడా కావచ్చు )...
మరి కొందరిని చూస్తే ప్రేమ కలుగుతుంది (ఇది కొందరికి, ఒక్కరే కాకపోవచ్చు)
కొందరిని చూస్తే ఇష్టం కలుగుతుంది .....(ఇది ప్రతి జీవీ కావచ్చు)
నిజానికి ....ఆలోచిస్తే.... మనుషులంతా ఒక్కటే ....మనం వాళ్ళ ముందుకు వెళ్ళనంత వరకు, లేదా వాళ్ళు మనకు ఎదురు కానంతవరకు ....
కానీ ఒకరికొకరు ఎదురయ్యాక ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే ...,,,
ప్రతి మనిషి ఒక అద్దం లాంటి వ్యక్తి మరో వ్యక్తికి ....ఎదురు కాగానే మన ప్రతిబింబం మనకు ఎదుటివాళ్ళలో కనిపిస్తుంది ....
ఆ ప్రతిబింబం మనం మనల్ని వాళ్ళల్లో ఎలా చూస్తున్నామో అలా కనిపిస్తుంది ....
అంటే మనల్ని చూసుకోవడానికి మనం భయపడుతున్నాం అంటే ... ,,,
ఎదుటి వాళ్ళు నిజం అనే అద్దాన్ని కలిగి ఉండి మన ప్రతిబింబం అబద్ధం కావచ్చు ....లేదా మనం నిజం అనే ప్రతిబింబాన్ని కలిగి ఉండి ఎదుటివాళ్ళు అబద్ధం అనే అద్దం కావచ్చు .....
మనల్ని మనం చూసుకోవడానికి సిగ్గేస్తుంది అంటే .....,,
ఎదుటివాళ్ళు నగ్నత్వం అనే అద్దాన్ని కలిగి ఉండి .. మన ప్రతిబింబం మనకు నగ్నంగా కనిపించొచ్చు ....లేదా మనల్ని మనం నగ్నంగా చూపించే అవసరం ఎదుటివాళ్ళ అద్దం ముందు మనకు అవసరం కావచ్చు ....(ఇక్కడ నగ్నత్వం అంటే ....భావ నగ్నత్వం అని పాఠకులు అర్ధం చేసుకోవాలని మనవి )
ప్రేమ ,ఇష్టం కూడా మన ఇష్టం మన ప్రేమ ని మనం చూసుకుంటున్నాం అని అర్ధం ....
ఇక ద్వేషం , పగ , ప్రతీకారం కూడా అలాంటివే ....
ఏది ఏమైనా ....ప్రతి మనిషి లో మనం చూసేది మన ప్రతిబింబాన్నే అని గుర్తు పెట్టుకుంటే ....
ప్రతి మనిషిలో మనలో ఉన్న ప్రేమనే చూసుకోవడం మనం అలవాటు చేసుకుంటే జగమంతా ప్రేమ మయమే కదా .... <3 <3 <3

No comments:

Post a Comment