Saturday, May 27, 2017

నీ బ్రతుకు నువ్వు ఎలాగైనా బ్రతుకు ....

మీకున్న భయాన్ని ఇతరుల మీద నెడుతున్నారా ....??!!
ఎందుకలా .....??!!
ఎందుకంటే ...,, మీరు మీ బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదు... అందుకే .... :P
మీరు మీ బాధ్యతలను నిత్యం నిర్వర్తిస్తూ ఉంటే ....మీకు ఏ పని గురించీ భయం ఉండదు ....
---------------------------------
ఉదాహరణకు ....,, ఒక పని చేయడానికి ఒక నెల రోజులు లక్ష్యం ఉందనుకోండి ....ఆ లక్ష్యం మనం నిత్యం తలచుకుంటూ ఉండాలి .....
రోజూ ఆ లక్ష్యం చేరుకోవడానికి అనుగుణంగా అడుగులు వేస్తూ ఉండాలి .....
లక్ష్యం చేరుకోవడానికి ఏ పనులు చేయాలో అవి ఏ రోజు కారోజు పూర్తి చేయాలి .....
అప్పుడు... లక్ష్యం చేరుకునే తేదీ రాగానే ...ఏ భయమూ , ఆందోళన , కంగారు లేకుండా లక్ష్యాన్ని చేరుకోగలం ....
ఒకవేళ చేరుకోలేకపోయినా ....ఎలాంటి భయం లేకుండా మరో తాజా లక్ష్యాన్ని పెట్టుకుంటాం .....
ఈసారి మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది ....ఏం చేయాలి ....ఎలా చేయాలి అని ......
--------------------------------
అదే ఆ లక్ష్యం చేరుకోవడానికి ఒక నెల రోజులు సమయం ఉంది కదా అని ....రోజూ ఇంటర్నెట్ లో సినిమాలు చూస్తూ కూర్చుని .....
ఆ లక్ష్యం చేరుకోవడానికి ఇంకా 10 రోజులు ఉంది కదా అని... చిరంజీవి , బాలకృష్ణ సినిమాలు ఎందుకు హిట్టయ్యాయి ....ఎందుకు ఫట్టయ్యాయి ....వాళ్ళు తిట్టుకున్నారా లేదా పొగుడుకున్నారా ....తిట్టుకుంటే ఎందుకు తిట్టుకున్నారు ....పొగుడుకుంటే ....ఫాన్స్ ఎలా ఊరుకున్నారు ....తదితర విషయాల మీద యు ట్యూబ్ లో రోజూ పనిలేకుండా ప్రసారం చేసే పోరంబోకు వార్తలు చూస్తూ కూర్చుని .....
లక్ష్యం చేరుకోవడానికి ఇంకా రెండు రోజులు ఉందనగా .....ఎలా చేయాలి ఏం చెయాలి అని భయం వేసి ....,,,
చుట్టు పక్కల ఉన్నవాళ్లందరికీ ఫోన్లు చేసి .....
ఎలా ఎలా ఎలా అనే పైశాచిక ప్రశ్నలతో పీక్కు తిని .....వాళ్ళ పని చెడగొట్టి ....వాళ్ళ మెదడుని చితగ్గొట్టి ....
చుట్టు పక్కల వాళ్ళందరూ నువ్వు చేయాల్సిన పనివైపు దృష్టి సారించేలా బెదిరించి .....ఎలాగైనా అందరూ ఆ పని చేసే తీరాలని కండిషన్ పెట్టి .....
వాళ్లకి ఆ పని అప్పచెప్పి .....
ఆనక తీరిగ్గా ....ఆమెకి అది లేదంట .....అతను ఆమెలో ఇది మాత్రమే చూశాడంట ....వాళ్లిద్దరూ వేరు పడ్డారు .....వీళ్ళందరూ ఈ పని చేయలేకపోయారు ....,,,,అనే యు ట్యూబ్ వార్తలను అదే పనిగా చూస్తూ ఉండి ....
ఇతరులు చచ్చి చెడి నువ్వు చేయాల్సిన పనిని కూడా వాళ్ళే చేశాక .....
హమ్మయ్య నా లక్ష్యం పూర్తయింది అని .....అందరికీ ఫోన్లు చేసి మరీ పూర్తి చేసానని సమాచారం ఇచ్చుకుని .....
యు ట్యూబ్ లో ....ఇతను ఆమెని అలా ఉపయోగించుకున్నాడు .....ఆమె అతన్ని అందుకు వాడుకుంది ....అనే దిక్కుమాలిన వీడియోలు చూస్తూ బ్రతుకుతుంటే .....,,,
------------------------------------------
నీ బ్రతుకు నువ్వు ఎలాగైనా బ్రతుకు .......అందుకు ఏ అభ్యంతరం లేదు .... ....
కానీ ఇతరుల బ్రతుకుల్ని "నీ భయం అనే బలహీనత రుద్ది" పీక్కు తినడం ...ఎంతవరకు న్యాయం .....??!!

No comments:

Post a Comment