Friday, May 12, 2017

అజాగ్రత్తగా నడిపే వాళ్ళ నుండి ....ఎలా బయటపడాలో నేర్పించడం

జీవితంలో మొదటిసారి ఈ రోజు నా చిన్న కూతురి డ్రైవింగ్ లో నాలుగు గంటలు ప్రయాణం చేశా ... <3
"చాలా బాగా నేర్చుకున్నా / చేస్తున్నా కదా ...." అడిగింది నా అభిప్రాయం కోసం ....
"చాలా బాగా చేస్తున్నావు నాన్నా ...." చెప్పా ... <3
అయినా అవకాశం దొరికినప్పుడు ....జాగ్రత్తలు చెప్పడం మాత్రం మర్చిపోలేదు .....
ఈ రోజుల్లో పిల్లలకు డైరెక్ట్ గా సలహాలు ఇస్తే నచ్చదు ....అది సలహా అని అనిపించకుండా ...."అలా చేస్తే బాగుంటుంది అని .....ఇలా నేను ఎప్పుడూ చేస్తూ ఉంటా , కంఫర్ట్ గా ఉంటే నువ్వు కూడా ఫాలో అవ్వొచ్చు .....ఈ పద్ధతి ఫాలో అవడం వలన ఈ ఉపయోగాలు / లాభాలు ఉండొచ్చు ....." ఇలా చెప్పాలి ..... :P
విపరీతమైన వర్షం ....విండ్ షీల్డ్ వైపర్స్ ఫుల్ స్పీడ్ లో ఉన్నాయి .....పక్కనే ఉన్నాను కాబట్టి నేనే తనకు రెస్పాన్సిబుల్ డ్రైవర్ ....ఇంకా తనకు లెర్నర్ పర్మిట్టే కాబట్టి ....
అంతలో ఒక ట్రక్ డ్రైవర్ ....ముందు వెళుతూ ఫాస్ట్ గా వెళ్లడం లేదు ... ....అది డబల్ లైన్ హైవే ...పక్క లైన్ లో కూడా ఒక కార్ వెళ్తుంది ...
"మనకు దారి ఇవ్వట్లేదు ....ఫాస్ట్ గా వెళ్లట్లేదు ....హార్న్ చేయనా" అడిగింది ....
'వద్దు వద్దు .....వర్షంలో స్లో గా వెళ్లడం తప్పులేదు ...." చెప్పా
"అయితే అతను రైట్ లేన్ కి వెళ్ళాలి .....లెఫ్ట్ లేన్ లో ట్రక్ ఇలా వెళ్ళకూడదు ....మనం హార్న్ చెయ్యొచ్చు ...." చెప్పింది ....
"వద్దు కొద్దిగా వెయిట్ చెయ్యి ....పర్లేదు ....." చెప్పా ....
అంతలో పక్క లేన్ ఖాళీ అయింది ....
"పక్కకి వెళ్లి ఓవర్ టేక్ చెయ్యి ....." చెప్పా ...
పక్కకి వెళ్లి ఓవర్ టేక్ చేసింది .....
నిజానికి రైట్ లేన్ లో ఉన్నవాళ్లను ఓవర్ టేక్ చెయ్యొచ్చు కానీ ....లెఫ్ట్ లేన్ లో ఉన్నవాళ్లను ఓవర్ టేక్ చేసి వాళ్ళ ముందుకు వెళ్లడం అంటే వాళ్ళను కించపరచడం లాంటిది ఇక్కడ ....
తప్పనిసరై వెళ్లాల్సి వచ్చింది కాబట్టి ....అర్ధం చేసుకుంటాడులే ....అనుకున్నా ...
కానీ కొంతసేపట్లో ....అతను కోపంతో మా పక్కకు వచ్చి ....మా కారుకి సమానంగా కావాలని మా లేన్ లోకి వస్తూ నడపడం మొదలు పెట్టాడు ......
అది ట్రక్ ....ఇది కార్ ...పైగా నా కూతురు డ్రైవింగ్ కి కొత్త .....
"వీడు కావాలని ఇలా చేస్తున్నాడు ....." కంగారుగా చెప్పింది నా కూతురు ....
"అర్ధమైంది .....నువ్వు అదే స్పీడ్ కంటిన్యూ చెయ్యి ...." చెప్పా పైకి నెమ్మదిగా ....
"ఇలాంటి వాళ్ళను మామూలుగా మడతపెట్టకూడదు ...." మనసులో అనుకున్నా ...
ట్రక్ మా ముందుకు తేవడానికి ప్రయత్నించాడు .....
"చోటివ్వకు ....ముందు కారుకి నీ కారుకి మధ్యలో స్పేస్ లేకుండా కంటిన్యూ చెయ్యి ...." చెప్పా ....
కాస్త ముందుకి వెళ్ళాక ట్రాఫిక్ క్లియర్ అయింది ....
ట్రక్ / కార్ రెండే ఉన్నాయి ....
"ఇప్పుడు 85 కి పెంచు స్పీడ్ " చెప్పా ....🚗
సాధారణంగా ....ట్రక్ ఎంత స్పీడ్ గా వచ్చినా కారుతో రాలేదు కాబట్టి ....10 నిమిషాల్లోనే కనుమరుగైపోయింది ....
"ఇప్పుడు కాస్త స్పీడ్ తగ్గించు ...."చెప్పా ....😎
కొందరు ....డ్రైవింగ్ లో కూడా వాళ్ళ పొగరుమోతు బుద్ధి పోనిచ్చుకోరు ....👿
సాధారణంగా నేను అలాంటి పోటీలు ఎప్పుడూ పెట్టుకోను....కానీ కావాలని ఓవర్ టేక్ చేయకపోయినా ....చిన్నపిల్ల మీదకు ట్రక్ తీసుకుని వస్తే .... ఎలా ఎదుర్కోవాలో నేర్పించకుండా మాత్రం ఎలా ఉంటాను ....??!!
తప్పనిసరిగా అది కూడా ట్రైనింగ్ లో భాగమే ....
అందుకే.... కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ఉన్నా ...ఎదుటివాడు మీద మీదకు వచ్చినప్పుడు ....ఎలా నిబ్బరంగా బయటపడాలో నేర్పించా ....
జాగ్రత్తగా ఎలా నడపాలో నేర్పించడం .....అజాగ్రత్తగా నడిపే వాళ్ళ నుండి ....ఎలా బయటపడాలో నేర్పించడం రెండూ అవసరమే కదా.....??!!🤔

No comments:

Post a Comment