Saturday, October 29, 2016

ఎలా అయితేనేం అందరూ ఆనందంగా ఉండడమే పండగ కదా ....

నాకు దీపావళి టపాసులు అన్నిటిలోకి చిచ్చుబుడ్లు అంటే ఎక్కువ ఇష్టం .... <3

అవి వెలిగించాక పువ్వులా వెలుగులు చిమ్ముకుంటూ ఆకాశానికి ఎగురుతాయి ... :) 

కానీ అవి ఎక్కువ రేటు ఉండేవి.....అందుకే 10 కంటే ఎక్కువ తెచ్చేవారు కాదు చిన్నతనంలో ....

మిగతావన్నీ చీకటి పడకముందే ఆత్రంగా కాల్చేవాళ్ళం కానీ ఇవి ఒక్కటి మాత్రం, చిక్కటి చీకట్లో పంచిన వెలుగుల్ని చూడడానికి ....అన్నీ కాల్చడం అయిపోయాక ...చివరలో కాల్చుకునే వాళ్ళం ...... <3

ఇవి కాల్చడానికి ముందే పదిమంది చుట్టూ గుమికూడేవాళ్లు ...ఎంత ఎత్తు వెళ్తుందో చూడాలని .....
చిచ్చుబుడ్డి సైజుని బట్టి ఎంత ఎత్తు వెళ్ళొచ్చో ముందుగానే అంచనా వేసేవాళ్ళం  .....అదిగో వేపచెట్టు కొమ్మ దాటి వెళ్తుందిరా .....అని ....లేదురా ఇది ఇందాక కాల్చిన దానికంటే చిన్నది .... గోడ దాటుతుంది అంతే అని ....పందెం వేసుకునేవాళ్ళం ..

అనుకున్నదానికంటే ఇంకా ఎత్తు ఎగిరితే సంబరంతో గంతులు వేసేవాళ్ళం ....ఎగరకపోతే మరో చిచ్చుబుడ్డిమీద ఆశలు పెట్టుకునేవాళ్ళం .....

దీపావళి పండగంటే వీధిలో ఒక్కరు టపాసులు కాల్చినా వీధి అందరూ ఆనందిస్తారు అది చూసి ....కాల్చినవాళ్లు కాల్చినందుకు ....చూసినవాళ్లు చూసినందుకు .....ఎలా అయితేనేం అందరూ ఆనందంగా ఉండడమే పండగ కదా .....


మిత్రులందరికీ దీపావళి శుభాకంక్షాలు .... :) :) :)

No comments:

Post a Comment