Friday, October 21, 2016

ఎక్కడ, ఏది, ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎంతగా అభిమానిస్తారో కారణాలు ....చెప్పడం కష్టం సుమా ....

మొన్న రోజు పిల్లల దగ్గర నుండి లంచ్ తీసుకుని స్కూల్ కి రమ్మని మెసేజ్ వస్తే .....తీసుకుని వద్దాం అని సబ్ కి వెళ్ళా .....

సరే ముందుగానే ....వాళ్లకి ప్రత్యేకంగా ఏం కావాలో ....ఫోన్ లో రిసీవ్ చేసుకున్న మెనూ చూసి ....అక్కడికి వెళ్ళాక ఒక్కొక్కటి ఆర్డర్ చేస్తూ ఉన్నా ....

పక్కనే ఉన్న అమెరికన్ లేడీ ...."మీరు ఇండియా నుండి వచ్చారు కదా ... ..." అడిగింది ....

"అవును" నవ్వుతూ చెప్పా ....

"మీ accent (ఉచ్చారణఅంటే నాకు చాలా ఇష్టం" అంది ..... <3

నిజానికి నేను ఇంగ్లిష్ మాట్లాడినా ఇండియన్ accent  కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ....మనం ఎంత అమెరికన్ accent నేర్చుకోవాలని ప్రయత్నించినా ...వాక్యానికి ఒక పదంలో అయినా ఇండియన్ accent రాక మానదు ....

పైగా నేను అలా ప్రయత్నించడం కూడా తక్కువ ....అందుకేనేమో వెంటనే కనిపెట్టేసింది ....

నా accent చూసి ....వాళ్ళ భాషను ఖూనీ చేస్తున్నాను అని కడుపు మండి అందో....కావాలని అందో ...కారణం ఏదైనా ....నా ముందు పొగిడింది కాబట్టి ఎంజాయ్ చేసేద్దాం అనిపించింది .... :) 

"ఓహ్ ....అవునా ....థాంక్స్ ..." చెప్పా నవ్వుతూ ...ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వేయకుండా .... <3

"చూశారా .....accent accent అని తెగ ఇదైపోతూ ఉంటారు .....మన accent ని కూడా లైక్ చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారని ఇప్పుడైనా ఒప్పుకుంటారా .....??!!" అప్పుడు నాతో ఫోన్ లో ఉన్న మావారితో సరదాగా చెప్పా .... :P 

"ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా ...." చెప్పారు ....అంతా వింటున్న తను కూడా ....

అయినా ఏదో అనుకుంటాం కానీ ....

ఎక్కడ, ఏది, ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎలా

ఎంతగా అభిమానిస్తారో కారణాలు ....చెప్పడం కష్టం సుమా ....!! :) :)

No comments:

Post a Comment