Sunday, October 9, 2016

పిల్లల్లో మంచి పిల్లలు ,చెడ్డ పిల్లలు అంటూ రెండు రకాల పిల్లలు ఉండరు

ఒక అమెరికన్ .....

నా కంటే వయసులో పెద్ద వ్యక్తి ....గౌరవించదగిన స్థానంలో ఉన్నారు ...అతనితో ఏదో మాట్లాడాల్సి వచ్చింది .......

అక్కడ మాటల సందర్భంలో ....

"నాకు ఒక బాబు ...పిల్లలతో నేను విసిగిపోయాను ....పిల్లలంటే భూతాలు ,రాక్షసులు ..... అందరు పిల్లలూ అలా ఉంటారని కాదు ....కొందరు మంచి పిల్లలు అలా ఉండకపోవచ్చు ....” అంటూ ....ఇంకా ఏదో చెప్పబోతుంటే ....,,,

“ఇది నేను అంగీకరించను ..పిల్లల్లో మంచి పిల్లలు ,చెడ్డ పిల్లలు అంటూ రెండు రకాల పిల్లలు ఉండరు ....పిల్లలు మాత్రమే ఉంటారు ….....
ఇంకా కావాలంటే పేరెంట్స్ లో మంచి పేరెంట్స్ ,చెడ్డ పేరెంట్స్ ఉండొచ్చు .....” అన్నాను నేను.... :) 

నేనలా అంటానని ఊహించలేదు అతను ....కాస్త షాక్ అయ్యాడు ....
---------------------------------------------------
ఏం చేస్తాను ....మాన్యుఫాక్చరింగ్ ఎఫెక్ట్ .... :( 

అక్కడికి మా అమ్మ చిన్నప్పటినుండి తిడుతూనే ఉంటుంది ...."నీకు పెద్ద చిన్నా తేడా లేదు ...ఎవరిని ఎంత మాట పడితే అంతా అనేస్తావు ...."అని .... :P 

అయితే మా అమ్మ దృష్టిలో పెద్దవాళ్ళకు ,నా దృష్టిలో పెద్దవాళ్ళకు నిర్వచనంలో తేడా ఉంటుందనుకోండి ..... :) :)