Friday, October 14, 2016

ఎవరు చూస్తారో ....ఎవరు విమర్శిస్తారో ...ఎవరు కాదంటారో .....ఎవరు అవునంటారో ....

కొంతమంది ...ఏమైనా తెలుసుకోవడంలో(జ్ఞానం ) అస్సలు ఎదగకపోవడానికి ...ఎంత ఎదిగినా(వయసులో ) ఏమీ తెలుసుకోకపోవడానికి నాకు తెలిసిన ఒక కారణం …...............,

“వాళ్ళ అంతర్ముఖం లోకి వాళ్ళు ఎప్పుడూ చూసుకోలేకపోవడం ….చూసి విశ్లేషించుకోలేకపోవడం.....”

సరే ….,వాళ్ళ అంతర్ముఖం లోకి వాళ్ళు ఎందుకు చూసుకోలేరా …అని తీవ్రంగా ఆలోచిస్తే ...., ఆ అంతర్ముఖంలో వాళ్ళు లేరు ....వాళ్ళు సృష్టించిన అబద్ధం ఉంది ....అని అర్ధమైంది ....


అందుకే ..ఆ అబద్ధాన్ని చూసుకోవాలంటే వాళ్ళకే భయం ....(అంటే ఆ అబద్ధాన్ని చూపించి ఇతరులను ఎప్పుడూ నమ్మిస్తూ ఉంటారనుకోండి ...మనం చాలా ధైర్యవంతులం కాబట్టి అదంతా చూసి నమ్ముతూ ఉంటాం .... :) )

ఆ అబద్ధాన్ని చూసుకోలేక వాళ్ళు ఎప్పుడూ పిరికి వాళ్ళుగా ఉంటారు ….

ఎప్పుడూ ...ఎవరు చూస్తారో ....ఎవరు విమర్శిస్తారో ...ఎవరు కాదంటారో .....ఎవరు అవునంటారో ....అని ….అనుక్షణం భయమే .....
ఈ అబద్ధపు ముసుగు వేసుకుని బ్రతికే వ్యక్తుల్లో మార్పు ఊహిస్తే మనకు నిరాశే .... :( :( 

No comments:

Post a Comment