Tuesday, October 11, 2016

విజయదశమి సందర్భంగా ఈ రోజు అమ్మను దర్శించుకున్నా ....

నా చిన్నకూతురు ఈ మధ్య డ్రైవింగ్ క్లాసెస్ కి వెళ్తుంది ... <3 

ఇంకా ఓ సంవత్సరం ఆగితే గాని దానికి డ్రైవింగ్ పర్మిట్ రాదు ....అయినా ....తనకు నడిపే వయసు వచ్చేనాటికి అంతా నేర్చుకుని , అన్ని టెస్ట్ లూ పాసైపోయి రెడీ గా ఉండాలని దాని ఆరాటం ....పర్మిట్ వచ్చాక ఒక్కరోజు కూడా వృధా కాకూడదు అన్నట్టు ....

ఈ రోజు ఒక టెస్ట్ వియయవంతంగా అయిపోయిందని ....చెబుతూ .....


తనకు నచ్చిన మోడల్ ....ఒక కారు ఉందని ....అదంటే తనకు చాలా ఇష్టం అని ....చాలా చిన్న కారు ....భలే ఉంటుంది ....చూపిస్తాను.... అని చెప్పి ....ఆ పిక్చర్స్ నాకు చూపించింది ... <3

"చాలా బాగుందిరా ....." చెప్పా ...నిజంగా చాలా బాగున్న కార్ పిక్స్ చూస్తూ ....

"ప్చ్ ...కానీ ఈ కారు కొనలేను ..." చెప్పింది విచారంగా ... :(

"ఏం ...ఎందుకని ...ఎక్కువ రేటు ఉందా ....??!!" అడిగా ....

"కాదు ...పెట్రోల్ ఎక్కువ కావాలి దీనికి ....అందుకే తక్కువ పెట్రోల్ ఉపయోగించే కార్ తీసుకుందాం అనుకుంటున్నా ...." చెప్పింది కాస్త నిరుత్సాహపడినా ....తన నిర్ణయం సరైనదే అనే నమ్మకం తొణికిసలాడుతుండగా .... <3

"పర్వాలేదురా ....నువ్వు అంత దూరం ఏం ప్రయాణం చేయవుగా ....ఇక్కడిక్కడే కాబట్టి ....అంత పెట్రోల్ ఖర్చు కాకపోవచ్చు ...." చెప్పా ...తనకిష్టమైనది వదులుకోవడం అనే నిర్ణయం ఇష్టం లేక ....

"ఉహు ...అందుకు కాదు ....దానివలన పర్యావరణానికి హాని జరుగుతుంది ....అలా చేయడం నాకు ఇష్టం లేదు ...." చెప్పింది ....అంతా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను అన్నట్టు ....

ఇక నాకు నోటివెంట మాట రాలేదు ....!!
"నిజంగా చాలా మంచి నిర్ణయం నాన్నా ....అసలు గర్వంగా ఉందిరా ....నీ ఆలోచనా విధానం చూస్తుంటే ...."చెప్పా ప్రేమగా ....తన నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్టు ... <3 <3 <3

--------------------------

ఈ సంభాషణ సగం నుండి విన్న వాళ్ళ డాడీ ...."అది తప్పు నిర్ణయం రా "....అన్నారు .... :P

"ఎందుకు డాడీ" అడిగింది ....ప్రశాంతంగా ....

"నీకిష్టమైన కారు నువ్వు తీసుకుని ....కాస్త పెట్రోల్ వలన కాలుష్యం ఇచ్చినా ........పర్యావరణం బాగుండడానికి ....ఓ నాలుగు చెట్లు నాటొచ్చు .....మళ్లీ ప్రకృతికి కావాల్సింది మనం ఇవ్వొచ్చు .....ప్రకృతిని మనం ఉపయోగించుకొని, మనకిష్టమైనట్టు జీవించడానికే ఉంది ...." చెప్పారు ... :P

--------------------------------------------

ఆ తర్వాత నా కూతురు నాకు ....కనిపించలేదు .....వినిపించలేదు... <3 <3

నిర్ణయం లో స్థిరత్వం , తాను అనుకున్నది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే ధైర్యం , సమర్ధత తో కూడిన వాదనాపటిమ , ప్రకృతిపై ఇష్టం , పర్యావరణంపై ప్రేమ , ఇషమైనవి వదులుకునే త్యాగం, తోటి ప్రాణుల క్షేమం గురించి ఆలోచించే దయ, హాని చేయడం పర్వాలేదన్న వారిపై ఆగ్రహం ..వాదించి గెలిచాక విజయ దరహాసం .....మూర్తీభవించిన చిట్టి అమ్మవారు కనిపించింది .. <3

చెడు ఆలోచనలను సంహరించి ..మంచి ఆలోచనలను రక్షించేవాళ్ళే ....
నా దృష్టిలో సృష్టిని రక్షించే అమ్మ ... <3

విజయదశమి సందర్భంగా ఈ రోజు అమ్మను దర్శించుకున్నా ....<3 <3 

No comments:

Post a Comment