Wednesday, October 5, 2016

"తప్పు నాదే" .................. :)

"తప్పు నాదే" .................. :)

ఈ పదం ఉపయోగించడం మొదలు పెట్టాక నా జీవిత విధానమే మారిపోయింది ....ఎంత ఉల్లాసంగా ఉంటున్నానో .....ఎంత సంతోషంగా ఉంటున్నానో ..... :)

ఈ పదం ఉపయోగించడం నాకు తెలియక ముందు ....ఒక నిముషం ,ఒక గంట ,పది గంటలు , లేదా రోజుల తరబడి ఒక విషయం మీద వాదించినా .....,
కొన్నిసార్లు వాదించలేక ....కొన్నిసార్లు వాదించడం వలన ఏం ఉపయోగం లేదని తెలిసి ....కొన్నిసార్లు మూర్ఖులతో వాదించడం అనవసరం అని తెలిసి ....నా తప్పు ఏమీ లేదని ఒప్పించడానికి శతవిధాలా ప్రయత్నించి .....ఒప్పించలేక ....చివరకు తప్పు నాదే అని ఒప్పుకుని .....తర్వాత ఎంతో బాధ అనిపించేది ...అరె ఇంత సమయం ఈ అనవసర వాదనతో వృధా చేసానే అని ....అయినా నా తప్పు లేకపోయినా తప్పు నాదే అని ఒప్పుకోవాల్సి వచ్చిందే అని బాధ కలిగేది ...... :(

ఇప్పుడు వాదన మొదలవుతుందని తెలిసిన ఒక్క క్షణం ముందే ...."తప్పు నాదే" అని నవ్వుతూ చెప్పేస్తున్నా ....ఎంత హాయిగా ఉంటుందో .....ఎంత సమయం ఆదానో ...ఎంత మానసిక ప్రశాంతతో ....!!

కానీ అవతలి వారికి నరకంలా ఉందట అలా చెప్పడం .....(సదరు వ్యక్తులే చెప్పారు )

అలాని వాళ్ళని నరకంలోకి తోసేయాలని నా ఉద్దేశ్యం కాదనుకోండి ....నేను స్వర్గం లోకి వెళ్ళాలని నా ఉద్దేశ్యం .......!! :) :) 

No comments:

Post a Comment