Friday, October 14, 2016

నేను చాలా సంతోషంగా ఉన్నాను అని నమ్మకం కలిగిన క్షణాలు అవి .....!!!

ఆ మధ్య ఎప్పుడో ఒకసారి ....నా కూతురి ఫ్రెండ్ మా ఇంటికి వచ్చింది ....గత కొన్ని సంవత్సరాలుగా తనకు నేను పరిచయమే .....
వాళ్ళింటికి నేను వెళ్తూ ఉంటాను....వాళ్ళు మా ఇంటికి వస్తూ ఉంటారు ....
అయినా ఆ రోజు ఎందుకో రాగానే నన్ను కొత్తగా చూస్తూ .....
"ఆంటీ ....ఈ మధ్య మీరు చాలా హాపీగా కనిపిస్తున్నారు ....కారణం ఏమిటి " అడిగింది హఠాత్తుగా .....
అసలు తనకు ఎందుకు అలా అనిపించిందో నాకు అర్ధం కాలేదు ..
నేను ఎప్పుడూ హాపీ గానే ఉంటాను .....ఒకవేళ బాధలున్నా పిల్లలముందు అవి మనం కనిపించనివ్వం కదా .....??!!
"అవునా ....థాంక్స్ ...కారణం ఏం లేదు .....మామూలుగానే ఉన్నా ...."నవ్వుతూ చెప్పా ...ఇంకేం చెప్పాలో అర్ధం కాక .....
ఆ తర్వాత పిల్లలు కూడా ఒకటి రెండుసార్లు ...ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాక కారణం ఏమిటా అని ఆలోచించా ....
"ఎవరికీ ..మనం చాలా సంతోషంగా ఉన్నాం , ఉత్సాహంగా ఉన్నాం అని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు ....
నిజంగా సంతోషంగా ఉంటే ....,,,,
మన నడత ,నడవడిక , మాట , హృదయంలో నిండిపోయి తొంగిచూసే నవ్వు , ఎదుటివారికి మన సంతోషాన్ని పంచాలని చూసే మన ఆతృత , సంతోషానికి ప్రతిరూపం ఇలానే ఉంటుంది అని సాక్ష్యం చూపే మన వదనం ......ఇవన్నీ మనం చెప్పకముందే చెప్పేస్తాయి ...మనం ఎంత సంతోషంగా ఉన్నామో ........" అని అర్ధమైంది .....
సరే, అది కావాలని తెచ్చిపెట్టుకునేది కాదు .....మన ఆలోచనలను తీర్చిదిద్దుకునే పరిపక్వతలోనే దాగి ఉంది అని కూడా అర్ధమైంది అనుకోండి ......అది వేరే విషయం .... :)
ఇదంతా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అనే కదా .....మీ సందేహం .......
ఈ రోజు నేను పనిమీద ఓ ఆఫీస్ కి వెళ్లాను ....
నిజానికి అక్కడ ఆఫీస్ లో ఒక ఆమె ఉంటుంది ....ఆమె అంటే నాకు చాలా ఇష్టం ... ఏ సమస్య ఆమె ముందుకు తీసుకుని వెళ్లినా ..పరిష్కరించడానికి ఆమె అనుసరించే విధి విధానాలు , ఆమె ఆలోచించే ఆలోచనలు ....ఆమె పనిచేసే విధానం ...నాకు వినూత్నంగా అనిపిస్తూ ఉంటాయి ....నేను సమస్య మర్చిపోయి ....ఆమె ఎలా పని చేస్తుందో చూస్తూ ఉంటా ....అన్నట్టు కొన్నిసార్లు పని జరగడం కోసం కొన్ని కన్నింగ్ ట్రిక్స్ ఉపయోగించి ....నా వైపు చూసి కన్ను కొట్టేది ....అది అర్ధమై నాకు నవ్వొచ్చేది .... :P
ఎలా అయినా సమస్యను పరిష్కరించాలి అని ఆలోచించే ఆమెను చూసి ....ఇలా పరిష్కరించాలి ఏ సమస్య అయినా ...అనిపించేది ....ఎన్నోసార్లు ఇంట్లో వాళ్లకు కూడా ఆమె గురించి చెప్పేదాన్ని .....
ఈ రోజు నేను వెళ్ళగానే ....., "నువ్వు ఎప్పుడూ నవ్వుతూ హాపీ గా కనిపిస్తావు ....నువ్వు నాకు స్ఫూర్తి కలిగిస్తున్నావు ...." అంది ఒక్కసారిగా .... <3
"నేనా ....నిజంగానా ....థాంక్స్ ....అసలు మీరు నాకు స్ఫూర్తి ....సమస్యలను పరిష్కరించే విధానం గురించి మా పిల్లలకు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటాను ...." నవ్వుతూ చెప్పా మనస్ఫూర్తిగా ... <3
అప్పుడు అనిపించింది ....
మనలోని సంతోషాన్ని మనం గుర్తించి, ఎదుటివాళ్ళకు చెప్పి , ఒప్పించి.... నమ్మించడం కాదు సంతోషం అంటే ..
మనలోని సంతోషాన్ని మనం గుర్తించకముందే ఎదుటివాళ్ళు గుర్తించి , మనకు చెప్పి, మనల్ని నమ్మించడం, సంతోషం అంటే .....అని ....
సందేహం లేదు ....నేను చాలా సంతోషంగా ఉన్నాను అని నమ్మకం కలిగిన క్షణాలు అవి .....!!! <3 <3 <3

No comments:

Post a Comment