Saturday, October 1, 2016

ఒకరోజు... అమెరికన్ గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్ళాను ....

నేను... అప్పుడెప్పుడో ....చాలా రోజుల క్రితం...ఒకరోజు... అమెరికన్ గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్ళాను ....

వెళ్ళగానే లైన్ లో నిలబడి ....నా వంతు వచ్చాక ....కౌంటర్ దగ్గర నేనొచ్చిన పని వివరించి ....అందుకు కావాల్సిన టోకెన్ తీసుకుని ....అక్కడే కూర్చుని తమ నెంబర్ కోసం ఎదురుచూస్తున్న వారి పక్కనే ....ఒక కుర్చీలో కూర్చున్నా ....

కూర్చోవడం ఆలస్యం .....అక్కడ ఉన్న వారందరినీ గమనించడం మొదలుపెట్టా ....ఎంతమంది ఉన్నారు ....ఎన్ని కౌంటర్ లు ఉన్నాయి ....ఎంతమంది తర్వాత నా నంబర్ వస్తుంది ....అని ....

అక్కడ ఎక్కువ మంది ఇతర దేశాల నుండి వచ్చినవారు ఉన్నారు ....కొందరు మాత్రం అమెరికన్స్ కూడా ఉన్నారు ....

నేను ఒక వరసలో చివరి కుర్చీలో కూర్చోవడం వలన ....ఎవరు లోపలి వెళ్లాలన్నా నేను లేచి వాళ్లకి దారి ఇవ్వాలి .....

అంతలో ఇద్దరు వృద్ధులైన భార్యాభర్తలు వచ్చారు....నా పక్కన ఒక్క సీట్ మాత్రమే ఖాళీగా ఉండడం వలన ....ఆ భర్త తన భార్యకు నా పక్కన ఉన్న సీట్ చూపించి ....తనను కూర్చోమన్నాడు ....అప్పటికే ఆమె నడవలేకపోతుంది ....భర్త గురించి ఆలోచించలేక చేతి కర్ర ఆసరాతో ...ఎలాగో వచ్చి తాను కూర్చుంది ........తన భార్య కూర్చున్న తర్వాత వెంటనే ఒకింత నిశ్చింత కనిపించింది నాకు ఆ భర్త మోహంలో ..... :)

వెంటనే నేను లేచి నిలబడి నా సీట్ ఆ వృద్ధుడికి ఇచ్చి కూర్చోమని చెప్పా ....ఇద్దరూ పక్కపక్కనే కూర్చుంటారు అని ....

నేను మరో వరసలో ఖాళీగా ఉన్న సీట్ లోకి వెళ్తానని ....మీ ఇద్దరూ కూర్చోండి అని చెప్పా ......ఇద్దరూ కృతజ్ఞతలు చెప్పారు .....

ఒకరికొకరు తోడుగా ఉన్న వారిద్దరినీ చూస్తే ముచ్చటగా అనిపించింది ....వారిని ఏ చోటు విడదీయడం మనం చూడలేకపోవడం మన సహజ స్వభావం అనిపించింది ...నాకే కాదు ఆ స్థానంలో ఎవరున్నా అలాగే అనిపిస్తుందేమో ... <3

-----------------------------------------------------------------

నేను ...మరో వరసలో ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నా ....అక్క్కడ నా పక్కనే ఒక అమెరికన్ లేడీ ఒకరు ఉన్నారు ....ఆమెకి ఒక 70 నుండి 80 సంవత్సరాలు ఉంటాయి .....చేతిలో కొన్ని ఫైల్స్ ఉన్నాయి .....

ఏవో నంబర్స్ పిలుస్తున్నారు ....నా నంబర్ రావడానికి ఇంకా చాలాసేపు పడుతుంది ....

పుస్తకాలు చదవడం లాంటివి నేను అలాంటి ప్రదేశాల్లో చేయలేను .....ఎప్పుడూ మనుషుల్ని గమనించడమే నాకు ఆసక్తిగా ఉంటుంది ....నేను నా పక్కనున్న ఆమెనే గమనిస్తూ ఉన్నా ....
ఆమె కాలుమీద కాలేసుకుని చాలా హుందాగా కూర్చుంది ....ఆమె వేసుకున్న పాంట్ ,షర్ట్ చాలా బాగున్నాయి ...నోటిలో చూయింగ్ గమ్ అనుకుంటాను ....నములుతూ ఉంది ....అన్నిటికంటే ఆమె ఆరోగ్యంగా కనిపిస్తుంది....అంతకంటే నాకు చాలా నచ్చే విషయం ఆమె హాయిగా , ఏ కల్మషం లేకుండా నవ్వుతూ ఉంది ...ఆమెని చూస్తే వృద్ధాప్యంలో ఇలాగే ఉండాలి అని ఓ క్షణం అనిపించక మానదు ....అందుకే నాకూ అలాగే అనిపించింది ....ముఖ్యంగా అలా నవ్వుతూ బ్రతకాలని ....

అంతలో ఆమె నంబర్ పిలిచారు ....ఫైల్స్ తీసుకుని ఆమె లోపలికి వెళ్ళింది ....కాసేపు ఏవో మాట్లాడి మళ్ళీ వచ్చి నా పక్కనే కూర్చుంది .....

బహుశా నేను అర్ధం చేసుకున్న దాన్ని బట్టి ఆమెని మళ్ళీ పిలుస్తాం అని చెప్పారు ...
నాకెందుకో కాస్త ఆసక్తిగా అనిపించి ....ఆమె ఫైల్స్ వైపు చూశాను ....అది ఒక డివోర్స్ ఫైల్ .....అంటే ఆమె తన విడాకులు అక్కడ నమోదు చేయడానికి వచ్చింది .....
-----------------------------------------------------------------------------

ఆమె వయసు , ఆమె ధీరత్వం , ఆమె వ్యక్తిత్వం , ఆమె జీవితం , ఆమె ఇష్టా ఇష్టాలు .....మొత్తానికి అది ఆమె జీవితం .....ఆమె జీవిస్తుంది .....

నా పని అయిపోయి నేను వచ్చేవరకు నేను ఆమెను గమనిస్తూనే ఉన్నాను .....అలా జీవితాన్ని గెలిచిన వాళ్లంటే నాకు గౌరవం ...

జీవితం సహజంగా ఉంటే అలా స్వీకరించి జీవించాలి ......
ఒకవేళ సహజంగా లేకపోయినా ...దానిని సహజంగా మార్చుకుని జీవించాలి ..... (అది వృద్ధాప్యం అయినా ....నడి వయసు అయినా ....చిన్నతనం అయినా ....)

నేను నేర్చుకున్న జీవిత సత్యం .....!! <3 <3 <3

No comments:

Post a Comment