Sunday, October 9, 2016

ఒకరు రాక్షసుడు ....మరొకరు భగవంతుడు ....

సాధారణంగా మనిషిలో ఇద్దరి లక్షణాలు ఉన్నాయి అంటూ ఉంటారు ....

ఒకరు రాక్షసుడు ....మరొకరు భగవంతుడు ....

మనం చూసే తీరులోనే ఎల్లప్పుడూ ఎవరు కనిపిస్తారు అనేది ఆధారపడి ఉందంటే నేను అంగీకరించలేను ....

ఒక్కొక్కసారి ఎదుటివ్యక్తి ప్రవర్తన మనపై ప్రదర్శించే తీరులో కూడా ఆధారపడి ఉంటుంది ....

భగవంతుడిని చూసినా ....ప్రదర్శించినా సమస్యలే లేవు .....

సమస్యల్లా రాక్షసుడితోనే.....,

రాక్షసుడిని ఎలా చుసినా ....వాళ్లకు దూరంగా ఉండాలని ...ఉంచాలని నిర్ణయం తీసుకుంటూ ఉంటాను ....అది కూడా సమస్య కాలేదు ....

సమస్య ఒక్కటే ....,

ఒకే వ్యక్తిలో రాక్షసుడిని,భగవంతుడిని ఇద్దరినీ చూస్తే ఏం చేయాలా అని .....,??!!

బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నా ....

ఎవరు ఎక్కువ శాతం ఉన్నారో చూసి ....ఎంత దూరం ఉండాలో ,ఎంత దగ్గరగా ఉండాలో నిర్ణయించుకోవాలని నిర్ణయించుకున్నా .... :) :) 

No comments:

Post a Comment