Tuesday, October 4, 2016

బళ్ళు ఓడలు ...ఓడలు బళ్ళు అయ్యాయని ....,,,

బళ్ళు ఓడలు ...ఓడలు బళ్ళు అయ్యాయని ....,,,పూలమ్మిన చోట కట్టెలు ...కట్టెలమ్మిన చోట పూలు అమ్మారని,,, ....ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరయ్యారని ...,,,ఏదేదో అంటూ ఉంటారు .... :)

అదంతా నిజమో కాదో నాకు తెలియదు కానీ ...ఎదుటివాళ్ళ పట్ల మనం ఏదైతే తప్పు చేశామో ....అది మనం సరిదిద్దుకుని ...అదే తప్పు మన పట్ల ఎదుటివాళ్ళు చేసినప్పుడు ....వాళ్ళని సరిదిద్దుకునేలా చేస్తే ....అదే …..జీవితానికి ఒక అర్ధం కాదా అనిపిస్తుంది అప్పుడప్పుడూ....

ఇంతకుముందు ...ఎవరైనా ...వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించకపోయినా ..ఆ బాధ్యతలు మనం గుర్తుచేయడం తప్పు అని భావించినా ....పైగా ఆ తప్పు ని నేర పరిశోధనా విభాగానికి అప్పగించి మనల్ని దోషుల్ని చేసినా …నాకు వాళ్ళ పట్ల విపరీతమైన కోపం వచ్చేది ....

అప్పుడు అసహనంతో అరవడం తప్ప మరో మార్గం కనిపించేది కాదు ....అలా నేను అరచినప్పుడు "నువ్వు చాలా కోపంగా ఉన్నావు ....తర్వాత మాట్లాడుకుందాం ...." అని ఒక సలహా నాకు ఉచితంగా వచ్చేది ........

అలా చాలా చాలా సలహాలు తీసుకుని తీసుకుని… ఇక జీవితంలో నేను ఎవరినీ ఉద్దరించకూడదు అని నిర్ణయానికి వచ్చాక .... ఒకరోజు .... ఒక శుభ సందర్భంలో….,,,,
నేను కూడా అదే సలహా ....నాకు ఇంతకు ముందు సలహా ఇచ్చిన వ్యక్తికే ఇవ్వగలిగాను ....

"మీరు చాలా ఫ్రస్టేషన్ లో ఉన్నారు ...తర్వాత మాట్లాడుకుందాం ...." అని నవ్వుతూ ఫోన్ పెట్టేశా ..... :) :)

అప్పుడు చూడాలి …..ప్రపంచాన్ని జయించినంత ఆనందం అనుకోండి ..... :)

No comments:

Post a Comment