Tuesday, October 25, 2016

మనకు గతం లో జరిగినవన్నీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి ....

మనకు గతం లో జరిగినవన్నీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి ....
మంచి సంఘటనలు జరిగితే ఇంకా మంచిగా కనిపిస్తాయి ....
ఒకవేళ చెడ్డ సంఘటనలు జరిగితే అవి కూడా మంచిగా కనిపిస్తాయి ... <3

భవిష్యత్తులో జరగబోయేవి ఊహించుకున్నప్పుడు కూడా భలేగా ఉంటుంది ....సాధారణంగా భవిష్యత్తులో జరగబోయేవి అన్ని మంచి విషయాల్లాగే ఊహించుకుంటాం కాబట్టి సమస్యే లేదు ....అప్పుడు చెడ్డ సంఘటనలు గురించి చింతించే అవసరం రాదు .... :) 

కానీ వర్తమానంలో జరుగుతున్నవి మాత్రమే మింగుడు పడవు ....
అందుకే ....మనసు ఎప్పుడూ వెనుకకు , ముందుకి ఆలోచించుకుంటూ.... వర్తమానంలో బ్రతకలేక బ్రతకలేక బ్రతుకుతూ ఉంటుంది .... :(

మాట్లాడితే చాలు .....,,,
ఇదివరలో అలా ఉండేది కదా .... రోజులే వేరు ...అనో ....,,,
రాబోయే రోజుల్లో ఇలా ఉంటుంది కదా .... రోజులు ఎప్పుడొస్తాయో అనో ...,,
అప్పుడు అలా జరిగింది.... ఎంత బాగుండేదో అనో ....,,,
ఓహ్... రేపు ఇలా జరగబోతుంది  ....ఎంత బాగుంటుందో ...అనో...,,,, 

మనసు అనుక్షణం పరి పరి విధాలా ఆలోచిస్తూ సంబరపడుతూ ఉంటుంది .. :) 

"ఏమే....వర్తమానం గురించి కాసేపు ఆలోచించరాదటే ...అని కసిరామనుకోండి....." 
"ఇప్పుడు ఇలా జరగాలి అంటే .....అందుకు నేను పని చేయాలి .....ఇప్పుడీ పని చేయాలా ....?? చాలా బాధగా ఉంది .....ఇలా అనుకోవాలంటే" అనే సమాధానం వస్తుంది ..... :( 

ఒకవేళ ....బలవంతగా అనుకునేలా చేయాలని మనం ఆదేశించినా ....శతవిధాలా తప్పించుకుని ...గతం లోకో , భవిష్యత్తులోకో ...మన కళ్ళు గప్పి పత్తా లేకుండా పోతుంది .... :P 

దీనికంతటికీ ఒకే ఒక్క కారణం ...."బాధ్యత" ....వర్తమానంలో పని జరగాలన్నా , సంఘటన గురించి ఆలోచించాలన్నా అది జరగడానికి బాధ్యత తీసుకోవాలి ....బాధ్యత తీసుకోవడం ఎవరికైనా బాధాకరంగానే ఉంటుంది ....

అదే గతంలోకి , భవిష్యత్తులోకి వెళ్లాలంటే అణా కాణీ "బాధ్యత" ఉండదు అక్కడ ....చెంగు చెంగున గంతులేసుకుంటూ వెళ్లి రావచ్చు .... :P 

ఎప్పుడైతే మనం, మన మనసుకి  ....వర్తమానం లో ఉన్న బాధ్యతను తీసుకోవడం అలవాటు చేసి ...ఆస్వాదించడం...ప్రేమించడం.. నేర్పిస్తామో...,,,అప్పుడు దానికి గతంలోకి , భవిష్యత్తులోకి వెళ్లే తీరిక ఉండదు , అవసరమూ రాదు ....

"ఓహ్ .... రోజు ఎంత బాగుందో…ఈ బాధ్యత తీసుకోవడం , ఈ పని చేయడం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ...! ” అనుకోవడం మొదలు పెడుతుంది ....

జీవితాన్ని క్షణంలో ఆస్వాదించడం అలవాటై బ్రతుకే నందనవనం అవుతుంది .....

అది కదా జీవితాన్ని జీవించడం అంటే ....! <3 <3 <3